డిసెంబర్ 5 నుండి 26 వరకు ‘ఆటా సేవా డేస్ & ఆటా వేడుకలు’ పేరుతో అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా డిసెంబర్ 13 న హనుమకొండ లోని అంబేద్కర్ భవన్ లో అన్నమయ్య , రామదాసు, త్యాగరాజుల (ఆర్ట్) ది జర్నీ టు ది మ్యూజికల్ సోల్ అనే కార్యక్రమాన్ని ప్రెసిడెంట్ భువనేశ్ బూజల, ప్రెసిడెంట్ ఎలెక్ట్, ఆటా సేవ డేస్ అండ్ ఆటా వేడుకలు చైర్ మధు బొమ్మినేని, ఆటా వేడుకలు కోచైర్స్, పాలకమండలి సభ్యులు అనిల్ బొద్ది రెడ్డి, శరత్ వేముల మరియు శారద సింగిరెడ్డి నిర్వహించారు. పూర్వ అధ్యక్షులు కరుణాకర్ ఆసిరెడ్డి , పాలకమండలి సభ్యులు సుధీర్ బండారు, కాశి కొత్త , సాయి సుదిని, వేణు పిస్కె, తిరుపతి రెడ్డి ఎర్రం రెడ్డి , ఆటా మహాసభల సలహాదారు గౌతమ్ గోలి, ఆటా కార్యవర్గ బృందం శ్రీనివాస్ ఏ ,సూర్య చంద్రా రెడ్డి , జ్యోత్సన బొబ్బాల కార్యక్రమానికి హాజరు అయ్యారు.
ఆటా కార్యవర్గం , మరియు నగర ప్రముఖులతో కలిసి భద్రకాళి దేవాలయం చైర్మన్ శ్రీ శేషు గారు , రామభద్ర క్షేత్రం స్థాపకులుశ్రీ సంతోష్ పండరి గారు మరియు వేద పండితుల మంగళ శాసనములతో జ్యోతి ప్రజ్వలన చేశారు. కృష్ణ వేణి మల్లావజ్జల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రముఖ సంగీత దర్శకులు, మరియు సంగీత విద్వాంసులు,గురువులు నిహాల్ కొండూరి , శాస్త్రీయ సంగీత విద్వాంసులు , గురువులు లాయక్ అహ్మద్ మొహమ్మద్ సంయుక్తంగా పదిహేను, పదహారు, పదిహేడు మూడు తరాలకు చెందిన అన్నమయ్య, రామదాస, త్యాగరాజ ముగ్గురు వాగ్గేయకారుల సంకీర్తనల సమ్మేళన ఉత్సవాన్ని వారి శిష్య బృందం కే.ప్రణతి , వినయ్, కార్తికేయ, శృతిక, నీలేష్, లాస్యప్రియ.ఎమ్ అభిజ్ఞ, వి.నికిత, శహబాజ్ మొహమ్మద్, హర్షిత్, వి.ప్రణవిలతో తిరుమల తిరుపతి దేవస్థానం పి.స్.ర్.కే పవన్ కుమార్ వాయిద్య బృంద సహకారం తో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులని మంత్ర ముగ్దుల్ని చేసింది. రావుల సాయి సంజన రెడ్డి అన్నమయ్య కీర్తనపై నృత్యం చేసారు. ఆటా కార్యవర్గ బృందం, ములుగు ఎం.ఎల్ .ఏ సీతక్క, శ్రీ శేషు గారు, శ్రీ సంతోష్ పండరి, వేద పండితులు, పుర ప్రముఖులందరిని, ఆర్ట్ కార్యక్రమాన్ని నిర్వహించిన కళాకారులని సత్కరించారు. అల్పాహారాన్ని అందించిన నేతాజీ ఫార్మసీ కాలేజీ యాజమాన్యానికి ఆటా కృతజ్ఞతలు తెలియచేసారు.