అమెరికా తెలుగు సంఘం (American Telugu Association – ATA) ఆగస్ట్ 20 వ తేది ఆదివారం రోజున W&OD ట్రైల్ ప్రాంగణంలో వర్జీనియా, ఆష్ బర్న్ (Ashburn, Virginia) నగరంలో 5k వాక్/రన్ ఫిట్ నెస్ ఛాలెంజ్ దిగ్విజయంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ATA ఉపాధ్యక్షులు జయంత్ చల్లా (Jayanth Challa) మరియు ఆటా ట్రస్ట్ బోర్ద్ సభ్యులు సుధీర్ బండారు (Sudheer Bandaru) మాట్లాడుతూ అందరు ప్రతి దినం ఒక గంట పాటు వాక్ లేదా రన్నింగ్ కి కెటాయించి ఆరోగ్యముగ వుండాలని కోరారు.
ఈ ఫిట్ నెస్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని అవగాహన పరచిన శ్రీని మల్లపురం, ఆటా ఫిట్ నెస్ ఛాలెంజ్ కో-ఆర్డినేటర్ షీతల్ బొబ్బ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) సంస్థ చేస్తున్నసేవా సహాయ కార్యక్రమాలను అందరికీ వివరించారు.
ఈ ఫిట్ నెస్ ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి సహకరించిన వారిలో ట్రస్ట్ బోర్ద్ సభ్యులు సుధీర్ బండారు, రవి చల్లా (కార్పోరేట్ స్పాన్సర్షిప్-ఛైర్), రీజనల్ కో-ఆర్డినేటర్ హనిమి వేమిరెడ్డి , అమర్ పాశ్య, హర్ష భరెంకబై మరియు మల్ల కాల్వ ,షీతల్ బొబ్బ (సోషల్ మీడియ కమిటి చైర్), రాము ముండ్రాతి (మీడియా కమిటీ చైర్), అమర్ బొజ్జ, సునీల్ కుడికల, ప్రవీణ్ దాసరి (పబ్లిసిటి కమిటి చైర్) మరియు కార్యక్రమాన్ని మీడియ కవరేజ్ చేసిన ఈశ్వర్ బండ ఉన్నారు.