Connect with us

Conference

అట్లాంటాలో ఆటా 18వ మహాసభల కిక్ ఆఫ్ & బోర్డు మీటింగ్, లోగో & పాట విడుదల

Published

on

అమెరికా తెలుగు సంఘం (ATA) ద్వైవార్షికంగా నిర్వహించు 18 వ మహాసభలను 2024 న జూన్ 7, 8 మరియు 9 తేదీ లలో అట్లాంటా లో అత్యంత వైభవోపేతంగా జరుపుటకు గాను 2023 సెప్టెంబరు 8,9,10 తేదీలలో అట్లాంటా లోని మారియట్ హోటల్ లో ఆటా బోర్డు సమావేశం, ఫేజ ఈవెంట్స్ నందు ఆటా18 వ మహాసభల కిక్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించబడింది.

సెప్టెంబరు 8 శుక్రవారం సాయంత్రం వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన మరియు వివిధ నగరాలలో సేవలు అందిస్తున్న ఆటా అధ్యక్షురాలు, ఉపాధ్యక్షులు, పూర్వ అధ్యక్షులు, ట్రస్ట్ బోర్ద్ సభ్యులు, రీజనల్ అడ్వైజర్స్, రీజనల్ కోఆర్దినేటర్స్, వుమెన్ కోఆర్దినేటర్స్, స్టాండింగ్ కమిటీస్, ఆటా అడ్వైజర్స్ పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరు అయ్యారు. ఆటా అట్లాంటా సభ్యులు మర్యాదపూర్వక స్వాగత సమారోహంతో ఆహ్వానిస్తూ ఆత్మీయ ఆతిథ్యం మరియు అద్వితీయ విందు వినోదాలతో అలరించింది.

మరునాడు సెప్టెంబర్ 9 శనివారం ఉదయం 9 గంటలకు బోర్డు సమావేశం గణనాథుని ప్రార్థనతో ఆరంభమయి, ఆటా అధ్యక్షురాలు శ్రీ మతి మధు బొమ్మినేని సారథ్యంలో, ఉపాధ్యక్షులు జయంత్ చల్లా, పూర్వ అధ్యక్షులు భువనేష్ బుజాల, హనుమంత్ రెడ్డి, కరుణాకర్ మాధవరం, సుధాకర్ పెరికారి మరియు పరమేష్ భీమ్రెడ్డి, కార్యదర్శి రామకృష్ణ రెడ్డి ఆల, కోశాధికారి సతీష్ రెడ్డి, సంయుక్త కోశాధికారి రవీందర్ గూడూర్, ట్రస్ట్ బోర్ద్ సభ్యుల,రీజనల్ అడ్వైజర్స్, రీజనల్ కోఆర్దినేటర్స్, వుమెన్ కోఆర్దినేటర్స్, స్టాండింగ్ కమిటీస్, ఆటా అడ్వైజర్స్ మరియు అట్లాంటా ఆటా బృందం ఆధ్వర్యంలో నిర్విరామంగా సమావేశాన్ని జరిపారు.

ఆటా (American Telugu Association) సభ్యుల ప్రోత్సాహభరిత సందేశాలు, మౌలిక సదుపాయాల చర్చ, ఆవశ్యక సేవా కార్యక్రమాలు, భారత దేశంలో డిసెంబర్ నెలలో జరుగు ఆటా వేడుకల చర్చలు, ఆమెరికన్ తెలంగాణ సొసైటి (ATS) సంస్థ విలీనం, సమావేశ సభ్యుల పరిచయం, మహాసభల తాత్కాలిక అడ్హాక్ బృందం ప్రకటన, ఆర్థిక మరియు సేవా అభివృద్ధి సంబంధిత అజెండా, రానున్న బోర్డు సమావేశపు కీలక నిర్ణయాలు వంటి పలు కీలక అంశాల అధ్యయనంతో ప్రభావాన్వితంగా సాగడం హర్షణీయం.

ఆటా 18 వ సభల కొరకు నియామికమైన కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ అనిల్ బోదిరెడ్డి నేషనల్ కోఆర్డినేటర్ సాయి సుదినిలు ప్రసంగిస్తూ అట్లాంటా తరుపున అందరికీ అభినందనలు తెలుపుకుంటూ ఆటా సభలకు గాను అందరి సహాయసహకారాలను సవినయంగా కోరుతూ, సభలను గూర్చి పలు అంశాల వివరణ అందించారు.

ఆటా మ్యాట్రిమోని కమిటీ కో-చైర్ రమేష్ నల్లవోలు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అట్లాంటాలో వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసారు. వధూవరులు, తల్లితండ్రులు, మిత్రులు సుమారు 50 కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం కమ్మని విందుతో బోర్డు సమావేశం సంపూర్ణం అయింది. మధ్యాహ్నం ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం, ఆటా 18 వ కాన్ఫరెన్స్ బృందం, ట్రస్ట్ బోర్ద్ సభ్యులు, అట్లాంటా ఆటా బృందం 18 వ మహాసభలను నిర్వహించు జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ (GWCC) ని సందర్శించి అట్లాంటా నగర వీధుల్లో ప్రత్యేక సందడి చేసారు.

సాయంత్రం 7 గంటలకు అట్లాంటాలోని ఫేస్ ఈవెంట్స్ లో కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ సమావేశం అధ్యక్షురాలు మధు బొమ్మినేని మరియు అట్లాంటా కోర్ సభ్యుల చేత సాంప్రదాయబద్దంగా జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టుకోగా గణనాథుని ఆరాధనతో శుభారంభమొందిన ఆ శుభవేళ కళారాధనతో మొదలయి నీలిమ గడ్డమనుగు నేపథ్యంలో వివిధ శాస్త్రీయ జానపద, చలన చిత్ర గీతికల నృత్య ప్రదర్శనలు, సంగీత విభావరి వంటి అద్భుత కార్యక్రమాలతో ఆద్యంతం సభాసదుల సావధానతను కైవశం చేసుకుంది.

ఆటా 18వ కాన్ఫరెన్స్ లోగో ను ఇటీవల ఎన్నికైన అమెరికా క్రికెట్ బోర్డ్ చైర్మన్ మరియు పూర్వ ట్రస్ట్ బోర్ద్ సభ్యులు వేణు పిసికె ఆవిష్కరించగా, మధు బొమ్మినేని, జయంత్ చల్లా మరియు కిరణ్ పాశం వేణు పిసికె ను సన్మానించారు. మధు బొమ్మినేని కాన్ఫరెన్స్ సాంగ్ ఆవిష్కరించబడగా ప్రసిద్ధ గాయకులు, అద్భుత సంగీత సహకారాన్ని అందించిన దర్శకులు మల్లికార్జున మరియు సాహిత్య సహకారం అందించిన మాధవి దాస్యం లను అధ్యక్షురాలు మధు బొమ్మినేని అభినందించగా సభాసదులు ప్రతిధ్వనించు హర్షధ్వానాలతో ఆటా సభ అడ్హాక్ సభ్యులను, సలహాదారులను, మరియు పూర్వ అధ్యక్షులను, స్పాన్సర్స్ ను మన్ననపూర్వక హర్షధ్వానాలతో సత్కరించారు.

ఈ శుభప్రద సాయంకాలం సుమారు 600 గౌరవ అతిథులతో కార్యక్రమం ఆద్యంతం మధురానుభూతులతో ఉల్లాసభరితంగా కొనసాగింది. శ్రావణి రాచకుల్ల సారథ్యంలో సుందర నారీమణుల వస్త్రాలంకరణ ప్రదర్శన (ఫ్యాషన్ షో) వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేయగా నూతన మోహన్ , జనార్ధన్ పన్నేల గార్ల అద్భుత గానాలాపన మరియు స్థానిక గాయకుల గానాలాపానతో జనరంజకంగా సాగింది ఆ శుభ సాయంకాలం.

కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం 18 వ కాన్ఫరెన్స్ కార్యక్రమాలు గురించి తెలుపుతు అందరికీ అభినందనలు తెలియచేశారు. అట్లాంటా లోని తెలుగు సంస్థలు TANA, TAMA, GATA, GATeS, GTA, NATA, TTA, TDF మరియు IFA ప్రతినిధులను 18 వ ఆటా మహాసభలకు ఆహ్వానించారు మరియు తెలుగు సంస్థల ప్రతినిధులు కూడా 18 వ ఆటా మహాసభల విజయవంతంగా సాగడానికి సహాయ సహకారాలను అందిస్తామన్నారు.

American Telugu Association అధ్యక్షురాలు మధు బొమ్మినేని తమ స్పందన తెలియచేస్తూ కార్యక్రమం అద్భుతంగా, అద్వితీయంగా కొనసాగడానికి కారకులైన విశిష్ఠ అతిథులకు, గౌరవ అతిథులకు, వదాన్యులకు, యూత్ వాలంటీర్స్ కు, అట్లాంటా కోర్ సభ్యులకు, అట్లాంటా కోర్ కాన్ఫరెన్స్ దాతలకు మరియు తదితర మీడియా మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు తెలియచేశారు.

కొసమెరుపుగా ATA కాన్ఫరెన్స్ డైరెక్టర్ అనిల్ బోదిరెడ్డి గారు తమ కృతజ్ఞతా సందేశాన్ని అందించారు. మరిన్ని ఫోటోల కొరకు www.NRI2NRI.com/ATA 18th Convention Kickoff ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected