Connect with us

Singing

సప్తస్వరాలు పలికించే గాయనీ గాయకులకు ATA ‘ఝుమ్మంది నాదం’ పాటల పోటీలు

Published

on

అమెరికన్ తెలుగు అసోసియేషన్ ATA అధ్యక్షులు మధు బొమ్మినేని (Madhu Bommineni), కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం (Kiran Pasham) నాయకత్వంలో శ్రీధర్ తిరుపతి కోఆర్డినేటర్ గా, ప్రశాంతి అసిరెడ్డి కోకన్వీనర్ గా, సాయి సుధిని నేషనల్ కోఆర్డినేటర్ గా, అనీల్ బొద్దిరెడ్డి డైరెక్టర్ గా, ప్రషీల్ గూకంటి కోకోఆర్డినేటర్ గా, శ్రీనివాస్ శ్రీరామ కోడైరెక్టర్ గా 2024 జూన్ 7 నుంచి 9 వరకు అట్లాంటా (Atlanta) మహానగరంలో 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సంగతి అందరికీ తెలిసిందే.

18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ (ATA 18th Convention & Youth Conference) లో భాగంగా ‘ఝుమ్మంది నాదం’ అంటూ పాటల పోటీలు (Solo Singing Competitions) నిర్వహిస్తున్నారు. సంగీత ప్రియులకు, వర్థమాన గాయనీ-గాయకులకు అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ వారి ఈ కార్యక్రమం మంచి వేదిక అవ్వనున్నది. అమెరికాలోని 13 నగరాలలో ఈ సోలో సింగింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు.

అమెరికా తెలుగు సంఘం ATA ‘ఝుమ్మంది నాదం’ పాటల పోటీలకు జనార్దన్ పన్నెల ఛైర్ గా, సత్య కర్నాటి అడ్వైజర్ గా, శ్రీవల్లి శ్రీధర్ & మౌనికారెడ్డి చింతల & విజయకుమార్ వింజామర కోఛైర్స్ గా, రామారెడ్డి తేతలి, అరుణ్ కావలి, శివకిరణ్ లింగిశెట్టి సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. మార్చి 31 రెజిస్ట్రేషన్స్ కి ఆఖరు తేదీ. ప్రిలిమినరీ స్క్రీనింగ్ యూ ట్యూబ్ వీడియోస్ ద్వారా చేస్తారు.

అట్లాంటా, చికాగో, షార్లెట్, ర్యాలీ, ఫిలడెల్ఫియా, నాష్విల్, లాస్ ఏంజలెస్, ఓర్లాండో, ఆస్టిన్, డల్లాస్, వర్జీనియా, డెట్రాయిట్, న్యూ జెర్సీ నగరాల్లో నిర్వహించిన అనంతరం ఫైనల్స్ 18వ ఆటా కన్వెన్షన్ వేదిక జార్జియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో ఇండియా నుంచి వస్తున్న సంగీత దర్శకులు నిహాల్ కొండూరి మరియు గేయ రచయిత కాసర్ల శ్యామ్ న్యాయనిర్ణేతలుగా నిర్వహించి విజేతలకు, రన్నరప్ లకు ఆటా (American Telugu Association) టైటిల్స్ అందజేస్తారు.

ఇంకెందుకు ఆలస్యం! ‌మీ స్వరంతో సప్తస్వరాలు పలికించండి, ఆటా ఝుమ్మంది నాదం 2024 విజేతలుగా నిలవండి. స్టార్ సెలెబ్రిటీస్ చేతుల మీదుగా అవార్డులు అందుకోండి. మీ ఎంట్రీ నమోదు చేసుకోవడానికి మరియు నియమనిబంధనల వివరాలకు www.NRI2NRI.com/ATA Solo Singing Competitions 2024 ని సందర్శించండి. అలాగే ఆటా కన్వెన్షన్ పూర్తి వివరాలకు www.ataconference.org ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected