అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ 17వ మహాసభలలో భాగంగా లఘు చిత్రాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఆటా అధ్యక్షులు భువనేష్ బుజాల తెలుగు వారందరిని ప్రోత్సహించటం కోసం నిర్వహించే టిక్ టాక్ వీడియో మరియు లఘు చిత్రాలలో ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ లో పేరు నమోదు చేసుకోండి. రెజిస్ట్రేషన్ ఆఖరు తేదీ జూన్ 1, 2022.
ఈ వీడియో మరియు షార్ట్ ఫిల్మ్స్ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ దర్శక నిర్మాత ‘కమిలి’ సినిమా జాతీయ అవార్డు గ్రహీత హరిచరణ ప్రసాద్, ప్రముఖ దర్శక నిర్మాత ‘మల్లేశం’ సినిమా క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు గ్రహీత రాజ్ రాచకొండ మరియు ప్రముఖ సంగీత దర్శకులు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నామిని కార్తీక్ కొడకండ్ల ఉన్నారు.
ఈ సదవకాశాన్ని వాడుకొని లఘు చిత్రాల పోటీలలో పాల్గొని విజయం సాధించండి. రిజిస్టర్ చేసుకోవడానికి www.ataconference.org/events-registrations ని సందర్శించండి లేదా atareels2022@gmail.com కి ఈమెయిల్ చెయ్యండి. ప్రముఖ కవులు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు పాల్గొనే ఆటా 17వ మహాసభల వివరాలకు www.ataconference.org ని సందర్శించండి.