జులై 1 నుండి 3 తేదీలలో వాషింగ్టన్ డీసీ లో జరుగుతున్న 17 వ ATA కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి ఇండియా నుండి అమెరికా చేరుకుంటున్న ప్రత్యేక అతిథులతో వాషింగ్టన్ డీసీ కళకళలాడుతుంది. సద్గురు జగ్గీ వాసుదేవ్, మాజీ క్రికెటర్లు గవాస్కర్, కపిల్ దేవ్, క్రిస్ గేల్, హీరో అడవి శేష్, నటి రకుల్ ప్రీత్ సింగ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అండ్ టీం, గాయకులు శ్రీకృష్ణ , సునీత వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు.
అలాగే మనీషా ఈరభతిని, మంగ్లీ, గీత రచయితలు చంద్రబోస్, రామజ్యోగయ శాస్త్రి, శేఖర్ మాస్టర్, పద్మశ్రీ పద్మజ, కూచిపూడి కళాకారుల బృందం, తనికెళ్ల భరణి, ఉపాసన కొణిదెల, యాంకర్లు శ్రీముఖి, రవి, ఇల్యూషనిస్ట్ బి ఎస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, TRS లీడర్ కుసుమ జగదీశ్వర్, మిమిక్రీ ఆర్టిస్ట్ రమేష్, మిమిక్రీ ఆర్టిస్ శివా రెడ్డి, కూచిపూడి గురువు డా. హలీం ఖాన్ గారు మరియు అనేకమంది రాజకీయ నాయకులు, కళాకారులు ఇప్పటికే వాషింగ్టన్ DC చేరుకోగా వారికి ATA టీం ఘన స్వాగతం పలికారు.
ATA ప్రెసిడెంట్ భువనేశ్ భూజాల, కన్వీనర్ సుధీర్ బండారు, స్వయంగా ఎయిర్పోర్ట్ కి వెళ్లి అతిధులకు స్వాగతం పలుకుతున్నారు. ఈ శుక్రవారం నుండి ఆదివారం వరకు జరిగే వేడుకల కోసం వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ ఎన్నో హంగులతో ముస్తాబయింది. అమెరికా నలు మూలల నుండి తెలుగు వారు హాజరవుతున్న ఈ వేడుకలు శుక్రవారం ఉదయాన్నే గోల్ఫ్ టోర్నమెంట్, యూత్ క్రికెట్ టోర్నమెంట్ తో ప్రారంభం అయ్యాయి.
సద్గురు, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్, రకుల్ ప్రీత్, సతీష్ తీగల గోల్ఫ్ టోర్నమెంట్ లో పాల్గొని సందడి చేస్తున్నారు. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్ యూత్ క్రికెట్ టోర్నమెంట్ కి అథిధులుగా హాజరవుతున్నారు. శుక్రవారం సాయంత్రం జరగబోయే banquet డిన్నర్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ఈ డిన్నర్ కి సెలబ్రిటీ అతిధులు అందరూ హాజరు కానున్నారు.