Connect with us

Cultural

Embrace Equity: వర్జీనియాలో ఘనంగా ఆటా 11వ మహిళా దినోత్సవ వేడుకలు

Published

on

వర్జీనియాలో ఏప్రిల్ 1 వ తేది శనివారం రోజున చిన్మయ సొమ్నథ్, చాంటిలి నగరంలో అమెరికా తెలుగు సంఘం (ATA) అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు #EmbraceEquity థీం తో దిగ్విజయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆటా అధ్యక్షురాలు శ్రీ మతి మధు బొమ్మినేని గారు, ఉపాధ్యక్షులు జయంత్ చల్లా గారు, పూర్వ అధ్యక్షులు భువనేష్ బుజాల గారు, ట్రస్ట్ బోర్ద్ సభ్యులు సుధీర్ బండారు గారు దీపాలను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఆటా అధ్యక్షురాలు శ్రీ మతి మధు బొమ్మినేని గారు వేడుకలకు పాల్గొనందుకు వారికి ఆటా వర్జీనియా టీం ప్రత్యేక ధన్యావాదాలు. శ్రీ మతి మధు బొమ్మినేని గారు, శ్రీ జయంత్ చల్లా గారు, శ్రీ భువనేష్ బుజాల గారు మాట్లాడుతు అంతర్జాతీయ మహిళా దినోత్స వేడుకను ప్రారంభించిన మొదటి జాతీయ తెలుగు సంస్థ ఆటా, 11వ వార్షికోత్సవం #EmbraceEquity థీం తో 2023 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంది.

ఈ సందర్బంగా ఆటా సంస్థ వాషింగ్టన్ ఏరియాలోని వివిధ రంగాలలో ప్రతిభ కనబరచిన మహిళ నాయకులను సత్కరించారు. రచ్న సిజెమొరె హైజెర్ – చైర్ మెంబెర్ అట్ లర్జ్ ఫర్ ఫేర్ఫాక్స్ కౌంటి స్కూల్ బోర్డ్; మగ్దలెన్ జన్సన్ ఓబాజి – అధినేత్రి ఫర్ ఎనైస్ సోల్యుసన్స్ కార్పొరేషన్; అనుపమ కటికనేని (అధినేత్రి – తారు టెక్నోలోజిస్).

ఆటా అధ్యక్షురాలు శ్రీ మతి మధు బొమ్మినేని గారు మరియు వివిధ రంగాలలో ప్రతిభ కనబరచిన మహిళ నాయకురాల్ల అనసూయ మల్యావంథం (డ్యాన్స్ అకాడమి); శ్రీలక్ష్మి రేపల్లి – (ఏంటెర్టైన్మెంట్); విజయ రాల్లబండి – (రియల్ ఏస్టెట్); స్వప్న నాగిరెడ్డి – (ఐటి ఎక్స్క్యుటివ్ ఫొర్ బ్యాంక్) తో సాముహిక చర్చలలో పాల్గొని మహిళలు వారి వారి రంగాల్లో వారి అనుభవాలతో పాటు మహిళా సాధికారత, మహిళా ఆరోగ్యం, మహిళా అభ్యున్నతి, ఆర్థిక స్వాతంత్య్రం అంశాలపై వారి విలువైన అభిప్రాయాలను, సలహాలను, సూచనలను అందరీతో పంచుకున్నారు.

స్వర్ణదేవి గుడ్ల & ప్రత్యూష నారపరాజు వారి సహకారం తొ ప్యానల్ చర్చ ముగిసింది. ట్రస్ట్ బోర్ద్ సభ్యులు సుధీర్ బండారు గారు నేత్రుత్వంలో సాముహిక చర్చలలో పాల్గోన్న జయంత్ చల్లా గారు (గవర్నర్ నామినేట్ – వర్జీనియా చిన్న వ్యాపారం కమీషన్) మరియు అనుపమ కటికనేని (అధినేత్రి -తారు టెక్నోలోజిస్) గారు చిన్న వ్యాపారం గురించి వారి అనుభవాలతో పాటు విలువైన అభిప్రాయాలను, సలహాలను, సూచనలను అందరీతో పంచుకున్నారు.

అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవం గా జరిగిన ఈ వేడుకలలో మహిళలు చాలాఉత్సాహం గా పాల్గొన్నారు. అన్ని వయస్సుల వారి ఫ్యాషన్ షో, పిన్నలు పెద్దల చే వివిధ నృత్య కర్యక్రమాలు, క్విజ్ పోటీలు ఇంకా మరెన్నో కార్యక్రమాలను నిర్వహించారు.

ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న వారికి బహుమతులు మరియు ప్రశంసాపత్రాలు బహూకరించారు. అలానే స్వఛ్ఛందంగా కార్యక్రమాలు నిర్వహించిన నేటితరం పిల్లలందరికీ ఆటా మెమెంటో లు బహూకరించారు. ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి సహకరించిన ఆటా వర్జీనియా మహిళ టీం కు కృతజ్ఞతలు.

దీపిక బుజాల (యూత్ స్కాలర్షిప్స్ కమిటి మెంబర్), నందినిరెడ్డి ఏడుల్ల (హెల్త్ కమిటి మెంబర్), అనిత ముత్తోజు (వివాహా కమిటి-ఛైర్), గాయత్రి చొక్కవరపు (ఆధ్యాత్మికం కమిటి ఛైర్), షీతల్ బొబ్బ (సోషల్ మీడియ కమిటి – ఛైర్), ప్రశాంతి ముత్యాల (రెజనల్ కో-ఛైర్). ప్రత్యేక కృతజ్ఞతలు అనూష గంజి (యూత్ కమిటి మెంబర్-రిజియన్), రవల్లిక బానోత్, ప్రత్యూష నారపరాజు, రోహిణి చల్ల (బిజినెస్ కమిటి మెంబర్).

ట్రస్ట్ బోర్ద్ సభ్యులు సుధీర్ బండారు గారు దిగ్విజయం కావడానికి సహకరించిన వివిధ దాతలకు, స్పాన్సర్స్ (వైర జువెల్స్, దెసి 360, పరినయ ట్రెండ్స్, సోమిరెడ్డి లా గ్రూప్, కాకతీయ కిచెన్, కంట్రి ఓవెన్, హల్లొ2ఇండియ గ్రాసరి, దేసి చౌరస్త,ఆర్క్, స్కై సోల్య్సొన్స్, లేబెల్ బై వీన, అదవంతజె ఈట్ ఇంక్ & కిరాక్ ఏంటెర్టైన్మెంట్స్) కి ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ప్రసారమాధ్యమ (ప్రింట్, రేడియో & ఎలక్ట్రానిక్ ) భాగస్వాములకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి అవ్వడానికి ముఖ్య కారణం ఆటా (American Telugu Association) సభ్యుల మధ్య సమన్వయం మరియు దిగ్విజయం కావడానికి సహకరించిన ఉపాధ్యక్షులు జయంత్ చల్లా గారు, పూర్వ అధ్యక్షులు భువనేష్ బుజాల గారికి ప్రత్యేక ధన్యావాదాలు.

ట్రస్ట్ బోర్ద్ సభ్యులు సుధీర్ బండారు, రీజనల్ డైరెక్టర్ కౌశిక్ సామ, రీజనల్ అడ్వైజర్ సుధీర్ దామిడి, రవి చల్లా (కార్పోరేట్ స్పాన్సర్షిప్-ఛైర్), రీజనల్ కో-ఆర్డినేటర్ హనిమి వేమిరెడ్డి, అమర్ పాశ్య,హర్ష భరెంకబై, లోహిత్ రెడ్డి మరియు మల్ల కాల్వ, రాము ముండ్రాతి (మీడియా కమిటీ చైర్), అమర్ బొజ్జ, వెంకట్ వూట్కురి (స్పోర్ట్స్-రీజనల్ చైర్), అనిల్ బొయినపల్లి (బిజినెస్ కమిటి మెంబర్), రాణా చెగు (బిజినెస్ కమిటి అడ్వైజర్), కిరణ్ పదెర (కమ్మ్యునిటి సర్వీసెస్-రీజనల్ చైర్), పవన్ గోవర్ధన (మెంబర్ బెంఫిట్స్), అనిల్ కాశినేని (మెంబర్ రిసోర్సెస్-చైర్), నవీన్ రంగ (ఎడ్యుకెషన్-మెంబర్), ప్రవీణ్ దాసరి (పబ్లిసిటి-చైర్), స్రీధర్ సన (స్పోర్ట్స్-చైర్), సంజయ్ నాయుడు (వెబ్&టెక్నొలొజి-కొ-చైర్).

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected