Connect with us

Literary

మనసులను చూరగొన్న అష్టావధాన కార్యక్రమం @ Melbourne, Australia

Published

on

Melbourne, Australia: ఆగస్టు 30th శనివారం నాడు మెల్ బోర్న్ (ఆస్ట్రేలియా) నగరంలో జనరంజని రేడియో సంస్థ (Janaranjani Radio), శ్రీ వేద గాయత్రి పరిషత్ (Sri Veda Gayathri Parishath), సంగీత భారతీ న్యూజిలాండ్ (New Zealand) తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో తెలుగులో అష్టావధాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించబడింది.

ఆస్ట్రేలియా (Melbourne, Australia) అవధాని, అవధానార్చనా భారతి, కవిరాజహంస, శారదామూర్తి శ్రీ తటవర్తి శ్రీకళ్యాణ చక్రవర్తి గారిచే చేయబడిన ఈ అవధాన కార్యక్రమానికి న్యూజిలాండ్ ప్రప్రథమ శతకకర్తగా రికార్డులు సాధించిన శ్రీమతి డా. తంగిరాల నాగలక్ష్మి గారు సంచాలకురాలిగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉన్నత సాహిత్య ప్రమాణాలతో కొనసాగింది.

సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, ఆశువు, కృతిపద్యం, చిత్రానికి పద్యం, అప్రస్తుత ప్రసంగం అనే అంశాలతో ఉత్కంఠతో సాగిన ఈ అష్టావధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు (Telugu) భాషను, సాహిత్యాభిమానాన్ని పెంచడానికి ఇటువంటి కార్యక్రమాలను తరచు నిర్వహించాలని పలువురు ప్రేక్షకులు సూచించారు.

ఈ కార్యక్రమము ఆధ్యాత్మిక కేంద్రమైన సంకట మోచన మందిరంలో విచ్చేసిన ప్రముఖులు ఆసాంతం వీక్షించి అవధాని గారిని, సంచాలకులను, నిర్వాహక సంస్థలను అభినందిస్తూ, తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలకు తగిన ప్రోత్సాహాన్ని కల్పించారు. సాంకేతిక సహకారం శరణ్ తోట అందించారు.

అప్రస్తుత ప్రసంగం లో పాల్గొన్న 11 ఏళ్ళ చిరంజీవులు కృష్ణ సుహాస్ తటవర్తి, ధ్రువ్ అకెళ్ళ అప్పటికప్పుడే అద్భుతమైన ప్రశ్నల వర్షం కురిపించడం అవధానాలలోనే ప్రత్యేకత సంతరించు కున్నది. కృతి పద్యము అనే అంశంలో చిన్నారులు గాయత్రి నందిరాజు మరియు తన్వి వంగల సభాసదుల మనసులను చూరగొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected