అట్లాంటాలో సెప్టెంబర్ 1, 2 మరియు 3వ తేదీలలో జరగబోతున్న ఆప్త (American Progressive Telugu Association – APTA) పదిహైను ఏళ్ళ సమావేశాలకి మార్చ్ 31వ తేది శుక్రవారం రోజున అట్లాంటా నగరంలో కిక్-ఆఫ్ సమావేశం స్థానిక తడక రెస్టారెంట్ లో ఘనంగా జరిగింది.
ఈ సమావేశాలకు ముఖ్య అతిధులుగా కన్వెన్షన్ చైర్ శ్రీ విజయ్ గుడిసేవ గారు మరియు వారి కార్యవర్గం కో-చైర్ శ్రీ వెంకట మీసాల గారు, సెక్రెటరీ శ్రీ సౌరి ప్రసాద్ కోచ్చెర్ల గారు, ట్రెజరర్ శ్రీ సురేష్ దూళిపూడి గారు విచ్చేశారు. చక్కటి బ్యాంక్వెట్ నైట్ కార్యక్రమంలో పదిహైను ఏళ్ళ సంబరాల లొగోని ఆవిష్కరించారు.
భూరి విరాళాలు ఇచ్చిన దాతలను సభాముఖంగా సత్కరించారు. కన్వెన్షన్ కన్వీనర్ శ్రీ విజయ్ గుడిసేవ (Vijay Gudiseva) గారు మాట్లాడుతూ అట్లాంటాలో ఆప్తులు విరాళాలు ఇవ్వడంలో కాకుండా, కన్వెన్షన్ కమిటీలలో ముఖ్యపాత్ర పోషిస్తారని చెప్పుకొచ్చారు.
ఎక్షిక్యూటివ్ టీం నుండి శ్రీ ఉదయ్ బాస్కర్ కొట్టె (Udaya Bhaskar Kotte) గారు, జనరల్ సెక్రెటరీ శ్రీ రవి ఎలిశెట్టి గారు, జాయింట్ ట్రెజరర్ శ్రీమతి జ్యోతి గాజుల గారు మాట్లాడుతూ 15 ఏళ్ళ సమావేశాలను విజయవంతం చెయ్యాలని విజ్ణప్తి చేశారు. బోర్డ్ చైర్ శ్రీ సుబ్బు కోట గారు మాట్లాడుతూ అమెరికాలో ఉన్న ఆప్తులందరూ పాల్గొని ఘనవిజయం చెయ్యాలని ఆకాంక్షించారు.
విరాళాలు ప్రకటించిన దాతల వివరాలు:- కన్వెన్షన్ కిక్-ఆఫ్ కార్యక్రమానికి శ్రీ కిరణ్ & శ్రీమతి మాధవి కనపర్తి గారు పదివేల డాలర్స్ విరాళంగా ఇచ్చారు. వారిని కన్వెన్షన్ కమిటి సత్కరించింది. శ్రీ సుబ్బు కోట గారు ఒక లక్షా ఏబై వేల డాలర్లు సౌత్ ఈస్ట్ అట్లాంటిక్ రీజియన్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల డాలర్లు కేపిటల్ రీజియన్ రెండు లక్షల అరవై ఐదు వేల డాలర్లు శ్రీ శ్రీనివాస్ చిమట గారు ఇరవై వేల డాలర్లు శ్రీ యర్రంసెట్టి సోదరులు పదివేల డాలర్లు డాక్టర్ సురేష్ అలహరి గారు ఐదువేల డాలర్లు శ్రీ త్రినాద్ ముద్రగడ గారు ఐదువేల డాలర్లు శ్రీ శివ కొప్పరాతి గారు ఐదువేల డాలర్లు శ్రీ సాగర్ మలిసెట్టి గారు ఐదువేల డాలర్లు
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికాలో వివిధ రాష్ఠాల నుండి ముఖ్యులు హాజరు కావడం విశేషం. వీరిలో ఆప్త బోర్డ్ చైర్ శ్రీ సుబ్బు కోట గారు, ఫౌడింగ్ కమిటి టీం శ్రీ ప్రసాద్ సమ్మెట గారు, శ్రీ చందు శ్రీనివాస్ గారు, శ్రీ శ్రీనివాస్ చిమట గారు, ఆప్త ప్రెసిడెంట్ శ్రీ ఉదయ్ బాస్కర్ కొట్టె గారు, జాయింట్ ట్రెజరర్ శ్రీమతి జ్యోతి గాజుల గారు, మాజీ అద్యక్షులు శ్రీ గోపాల్ గూడపాటి గారు, సౌత్ పసిపిక్ ఆర్.వి.పి కొండల వాయినేని గారు, శ్రీ రత్నాకర్ గారు సెంట్రల్ ఆర్.వి.పి, ఫ్లోరిడ స్టేట్ కో-ఆర్డినేటర్ శ్రీ దాస్ ఆకుల గారు, టెక్సాస్ స్టేట్ కో-ఆర్డినేటర్ శ్రీ దిలీప్ రామిసెట్టి గారు ఉన్నారు.
అలాగే గ్లోబల్ ఆపరేషన్స్ చైర్ శ్రీ మధు వుళ్ళి గారు, స్పెషల్ నీడ్స్ వైస్ చైర్ శ్రీమతి దేవి గడ్డం గారు, స్పిరిచ్చువల్ చైర్ రజని తాడి గారు, ఎలక్షన్ కమిటి చైర్ శ్రీ సత్య సుందరనీడు గారు, ఇన్నొవేషన్ థింక్ టేంక్ చైర్ శ్రీ రమేష్ బాస గారు, న్యూస్ మిడియా చైర్ శ్రీ చంద్ర పోలిసెట్టి గారు, బిజినెస్ వైస్ చైర్ శ్రీ రాజేష్ యాళ్ళబండి గారు, 2024 టీం తరుపున వైస్ ప్రెసిడెంట్ శ్రీ మాదవ్ తళారి గారు , శ్రీ శ్రీనివాస్ నండూరి గారు , శ్రీనివాస్ చల్లా ఫ్రం చార్లెట్, మరియు శ్రీ సోమ శేఖర్ (సంపత్ మాదాల గారి తండ్రి గారు) ఫ్రం వర్జినియ నుండి పాల్గొనడం జరిగింది.