Connect with us

News

చంద్రబాబు చేతుల మీదుగా అట్టహాసంగా AAA Convention పోస్టర్ విడుదల: Andhrapradesh American Association

Published

on

ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (Andhrapradesh American Association – AAA) మొట్టమొదటి జాతీయ కన్వెన్షన్ వచ్చే 2025 మార్చి 28, 29 తేదీలలో పెన్సిల్వేనియా లోని ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్ పో సెంటర్ (The Greater Philadelphia Expo Center, Oaks) లో పెద్ద ఎత్తున నిర్వహించనున్న సంగతి అందరికీ విదితమే.

ఇప్పటికే అమెరికాలోని పలు రాష్ట్రాల్లో వేగంగా చాఫ్టర్స్ ఏర్పాటు చేసి, ఆంధ్రప్రదేశ్ సంస్కృతీ సంప్రదాయాలే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA), సంస్థ లోగో లో ఉన్న కల్చర్ ఎట్ కోర్ (Culture at Core) ట్యాగ్ లైన్ ని మనసావాచా పెంపొందించేలా ఈ మొట్టమొదటి జాతీయ కన్వెన్షన్ (Convention) కి వడివడిగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే భారతదేశం (India) మరియు అమెరికా (United States) లో ప్రమోషన్స్ షురూ చేశారు. ముగ్గులు, మ్యూజిక్, షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ వంటి పలు పోటీలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లు ప్రపంచంలోని తెలుగు వారందరూ ఎక్కడున్నాసరే పాల్గొనేలా, పైగా లక్షల రూపాయల (మొత్తంగా సుమారు కోటిన్నర) బహుమతులతో అందరి ఆసక్తిని AAA కన్వెన్షన్ వైపు తిప్పారు.

ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister) నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కన్వెన్షన్ పోస్టర్ ఇండియాలో ఘనంగా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో కన్వెన్షన్ వివరాలు, హైలైట్స్ మరియు AAA నాయకులు హరి మోటుపల్లి (Hari Motupalli), బాలాజీ వీర్నాల, హరిబాబు తూబాటి, శివకృష్ణ మందలపు ఫొటోలు ఉన్నాయి.

కన్వెన్షన్ పోస్టర్ లాంచ్ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) AAA సంస్థ ఫౌండర్ హరి మోటుపల్లి, సంస్థ విధివిధానాలు, మోటివేషన్, వివిధ పోటీలు, ప్రైజ్ మనీ వంటి విషయాలను అడిగి తెలుసుకొని కన్వెన్షన్ కి శుభాకాంక్షలు తెలపడం విశేషం. అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యార్థినీవిద్యార్థులకు (Andhra Pradesh Students) సహాయసహకారాలు అందించాల్సిందిగా కోరారు.

error: NRI2NRI.COM copyright content is protected