యూరోప్ లోని ఐర్లాండ్, నెథర్లాండ్స్,యూకే, స్విట్జర్లాండ్, బెల్జియం, మాల్టా, ఇటలీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, పోలాండ్, హన్గేరి, సైప్రస్ తదితర దేశాల ప్రవాసాంధ్రులతో సమన్వయము చేసుకుంటూ చంద్రబాబు గారి స్ఫూర్తి, లోకేష్ గారి నాయకత్వంతో జన్మభూమి కోసం పాడుపడతాము అని డా.కిశోర్ బాబు చలసాని గారు తెలిపారు.
పార్టీ అధికారం లో ఉన్నా లేకున్నా గత 4 సంవత్సరాలుగా ఎన్నారై టీడీపీ యూరప్ వారు సామజిక కార్యక్రమాల్లో దూసుకు పోతున్నారు. గతంలో తిత్లీ తుఫాన్‌లోనూ, ఉక్రెయిన్‌లో బాధితులకి సహాయం చెయ్యడంలో కూడా ముందుండి పార్టీ ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. విదేశాలకి వచ్చిన స్టూడెంట్స్‌కి తమ పరిధి మేరకు సహాయం చేయ్యడం, అలానే మంచి ఉద్యోగాలు ఇప్పించటంలో యూరప్‌లో మొదటి నుంచి బాగా పని చేశారు.
ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలకి సోషల్ మీడియా ట్రైనింగ్, ఇతర ట్రైనింగ్స్ ఇచ్చేలా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో స్ట్రాటజీతో ముందుకు వెళుతున్నారు. తెలుగుదేశం వస్తేనే యువతకి భవిత లేకపోతే మరో 30 ఏళ్ళు వెనక్కి పోతారు అని ప్రచారం చేస్తూ తమ వంతుగా అక్కడ పార్టీకి ఉపయోగపడే విధంగా ముందుకు కొనసాగుతున్నారు. కార్యకర్తల మీద దాడులు జరిగితే అండగా ఉండి న్యాయ సహాయం చేశారు. పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్నీ ఇక్కడ చేస్తున్నారు.
ఇదే బాటలో కొన్ని నియోజకవర్గాలని వీరు ఎంచుకుని ఒక ప్రణాళిక ద్వారా సేవా కార్యక్రమాలు అమలు పరుస్తున్నారు. పూతలపట్టు నియోజకవర్గం లో క్రికెట్ లీగ్ కానీయండి, గత నెల లో గుంటూరు జిల్లా లో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకి ఆర్ధిక సహాయం కానీయండి, యువగళం లో ప్రియతమ నేత నారా లోకేష్ గారి తోపాలుపంచు కోవడం కానీయండి, ఇలా చెప్పుకుంటూ పొతే స్వదేశం లో ఉన్న టీడీపీ వారి కి సమానం గా సేవా కార్యక్రమాల్లో పోటీ పడటం చూసి అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు.
శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి పురస్కరించు కొని టీడీపీ యూరప్ తరపున మరియు వూట్ల శ్యాం సుందర్రావు గారు (యూకే – లండన్ ) తమ వంతు చేయూత గా పూతలపట్టు నియోజకవర్గం లో అన్న కాంటీన్ ఏర్పాటుకు కృషి చేసారు.అలాగే భవిష్యత్తు లో కూడా ఇలానే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ పార్టీ ను అధికారం లోకి తీసుకు రావడం కోసం తమవంతు సహాయ సహకారాలు అందిస్తాం అని అన్నారు.
డా. కిషోర్ బాబు చలసాని, అమర్నాథ్ పొట్లూరి, వివేక్ కరియవుల, కృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ, ప్రముఖ్ గోగినేని, చందు కాట్రగడ్డ ,విజయ్ అడుసుమల్లి, వూట్లా శ్యామ్ సుందర్ రావు, వెంకటపతి తరిగొప్పుల, శివబాబు వేములపల్లి, డా.హరిప్రసాద్ కుత్తంబాకం, స్వాతి రెడ్డి, శ్రీనివాస్ గోగినేని, విజయ్ కృష్ణ చందోలు , జితేష్ గోడి , కృష్ణ వల్లూరి , ప్రవీణ్ ఉన్నం, ప్రవీణ్ వెలువోలు, కొండయ్య కావూరి, శివ కృష్ణ, సుమంత్ పదాల, రామకృష్ణ, సతీష్ ముళ్ళపూడి, సాయి వెంకట్ మౌర్య మరియు ఇతర యూరోప్ టీడీపీ అనుబంధ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.