Connect with us

Festivals

మొదటిదే కానీ మేటి ఈవెంట్, ఆంధ్రప్రదేశ్ వైభవాన్ని చాటిన AAA సంక్రాంతి సంబరాలు @ Atlanta, Georgia

Published

on

Atlanta లో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (Andhra Pradesh American Association – AAA) అట్లాంటా చాప్టర్ ఆధ్వర్యంలో  సంక్రాంతి ఉత్సవం అద్భుతంగా నిర్వహించబడింది. ఇది ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబిస్తూ, అట్లాంటా తెలుగు వారికి వినూత్న అనుభవాన్ని అందించింది.

AAA అట్లాంటా చాప్టర్ (Atlanta Chapter) ప్రెసిడెంట్ శ్రీ కమల్ బరవతుల మరియు ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ సాయి చంద్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవం, వేలాదిగా హాజరైన ప్రజలను ఆనందంతో నింపింది. వారు తమ స్వస్థలం ఆంధ్రప్రదేశ్/ఇండియా నుంచి దూరంగా ఉన్నప్పటికీ, సంక్రాంతి (Sankranti) ఉత్సవం యొక్క అద్భుతమైన ఆనందాన్ని అనుభవించారు.

ఈ కార్యక్రమం ముఖ్యాంశాలు: ఈ సంక్రాంతి ఉత్సవంలో అనేక సాంస్కృతిక ప్రదర్శనలు జరిగినాయి. ఇందులో పిల్లలు మరియు యువత వారి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించి, ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక వైభవాన్ని అందరికి చూపించారు. ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకమైన మరియు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజల చేత ఆదరించబడిన 45 రుచికరమైన వంటకాలను వడ్డించారు.

ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు డాక్టర్ కోటి (Koti) గారు మరియు ఆయన బృందం యొక్క సంగీత ప్రదర్శన జరిగింది, ఇది ప్రతి ఒక్కరినీ మంత్రముగ్దులను చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు AAA సంస్థని అభినందిస్తూ, అట్లాంటా (Atlanta) లో సంక్రాంతి ఉత్సవాన్ని ఎంతో గొప్పగా నిర్వహించారని అభినందించారు. 

“సంక్రాంతి పండుగ యొక్క నిజమైన ఆనందం మరియు వాతావరణాన్ని మన స్వదేశం నుండి దూరంగా ఉన్నప్పటికీ ఇక్కడ అనుభవించగలుగుతున్నాం.” అని ప్రశంసలు కురిపించారు. “ఇది మా హృదయాలను తాకిన వేడుక” అని అనేక మంది వ్యాఖ్యానించారు.

“ఇక్కడ ఇలా మన సంస్కృతిని (Culture) పునరుద్ధరించడం, ఇంతటి అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని అందరం భావిస్తున్నాం. మా పిల్లలు మన సంస్కృతి గురించి తెలుసుకోవడానికి ఇది గొప్ప అవకాశం అని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.”

ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి ప్రణాళికలు రచించి, ప్రోత్సహించిన AAA వ్యవస్థాపకుడు హరి మోటుపల్లి గారికి అందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. “హరి గారి దార్శనికత, అంకితభావం లేకుండా ఇది సాధ్యం అయ్యేది కాదు” అని పలువురు అన్నారు. అలాగే, AAA నేషనల్ ప్రెసిడెంట్ బాలాజీ వీర్నాల మరియు AAA నాయకత్వ బృందం చేసిన కృషిని కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఈ అద్భుతమైన వేడుకను వాలంటీర్లు ఎంతో కష్టపడి నిర్వహించారు. వారు ప్రతి విభాగంలో తమ సేవలు అందించి, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. AAA అట్లాంటా ప్రెసిడెంట్ శ్రీ కమల్ బరవతుల,  ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ సాయి చంద్ గారు మరియు కోర్ టీమ్ సభ్యులు ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

అలాగే Andhra Pradesh American Association (AAA) వ్యవస్థాపకుడు శ్రీ హరి మోటుపల్లి (Hari Motupalli) గారి సందేశాన్ని వివరించారు. అమెరికాలో నివసిస్తున్నఆంధ్రప్రదేశ్  ప్రజలను సమైక్యపరచడం మరియు ఆంధ్రప్రదేశ్  సంస్కృతిని ప్రోత్సహించడం తమ లక్ష్యంగా పెట్టుకున్నారని  వివరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న AndhraPradesh American Association లీడర్షిప్ టీమ్ హరిబాబు తుబాటి (నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్), వెంకట రాజు కలిదిండి, భాస్కర్ రెడ్డి కల్లూరి, రవితేజ మారినేని (గవర్నింగ్ బోర్డు సభ్యులు), శ్రీనివాస్ అడ్డా – PA state ప్రెసిడెంట్, సత్య వెజ్జు – NJ state ప్రెసిడెంట్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సత్యేంద్ర వానపల్లి (ఆస్టిన్ ప్రెసిడెంట్) మరియు కిషోర్ యార్రా (ఆస్టిన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్) ఈ ఈవెంట్ కు ఇన్‌ఛార్జిగా పర్యవేక్షించి ఏర్పాట్లను చేపట్టడంలో కీలకపాత్ర పోషించారు. అలాగే, అంజన్ (Delaware State ప్రెసిడెంట్), అశోక్ బుడామ (Delaware State ప్రెసిడెంట్ ఎలెక్ట్) సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి AVK Tech Solutions Inc అధినేత KVS Raju గారు స్పాన్సర్ గా వ్యవహరించారు. ఈ Andhra Pradesh American Association సంక్రాంతి ఉత్సవం AAA అట్లాంటా చాప్టర్ (AAA Atlanta Chapter, Georgia) ద్వారా ఆంధ్రప్రదేశ రాష్ట్ర సాంస్కృతిక ప్రదర్శనలకు గొప్ప ఉదాహరణగా నిలిచింది.

error: NRI2NRI.COM copyright content is protected