ఈ సంవత్సరం ప్రపంచం మొత్తం మీద సుమారు 150 దేశాలలో ఎలక్షన్స్ ఉన్నాయంట. అయినప్పటికీ భారతదేశం (India) లోని ఎలక్షన్స్ కి ఉన్న క్రేజ్ మరెక్కడా లేదు. ఒక పక్క NDA కూటమి, మరో పక్క INDIA కూటమి, అక్కడక్కడా ప్రాంతీయ పార్టీల హవా. సెంట్రల్ లో ఈసారి కూడా NDA కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంటదని టాక్ నడుస్తుంది.
ఇక రాష్ట్రాల విషయానికి వస్తే అందరి ఫోకస్ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పైనే ఉంది. తెలుగుదేశం పార్టీ (TDP), జనసేన (Janasena) మరియు బీజేపీ (BJP) తో కూడిన NDA కూటమి ఒక వైపు ఉంటే YSR కాంగ్రెస్ పార్టీ (YCP) మరోవైపు ఉంది. మొదట్లో వై నాట్ 175 అనే దగ్గిర నుంచి, ఇప్పుడు కనీసం 90+ సీట్లతో అన్నా తిరిగి YCP పవర్ లోకి వస్తుంది అనే వరకు వచ్చారు.
ఈ సమయంలోనే TDP & Janasena వాళ్ళని ప్రొవోక్ చేసి మరీ బెట్టింగ్ లకు దిగారు YCP వాళ్ళు. 1:1 అంటూ కాయ్ రాజా కాయ్, పందానికి పందెం సై అంటూ జోరుగా బెట్టింగ్ లు పెట్టారట. అటు ఇండియాలోనే కాకుండా ఇటు అమెరికాలో కూడా బానే బెట్టింగ్ లు పెట్టారని టాక్. ముఖ్యంగా డల్లాస్, షార్లెట్, కాలిఫోర్నియా, అట్లాంటా, వర్జీనియా, న్యూ జెర్సీ, వాషింగ్టన్ డీసీ ప్రాంతాలలో పెద్ద మొత్తంలోనే పందాలు నడిచాయట.
ఆ సమయంలో కొంచెం ఆలోంచించిన TDP & Janasena వాళ్ళు, ఇప్పుడు మాత్రం YCP జగన్ (YS Jagan Mohan Reddy) పరిస్థితి కాడి వదిలేసే వరకు వచ్చిందంటూ మంచి దూకుడుగా ఉన్నారు. 1:2 కి రెడీ అంటూ మంచి వేడి మీద ఉన్నారని తెలిసింది. కాకపోతే ఇప్పుడు కూడా కొంతమంది YCP వాళ్ళు ఆశాజనకంగానే ఉన్నారట. పోలింగ్ రోజున జగన్ ఏదొక మ్యాజిక్ చేసి మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటారనే ఆశాభావంతో ఉన్నట్లు వినికిడి.
TDP వాళ్ళు మొదట్లో తక్కువలో తక్కువ కనీసం 100+ సీట్లతోనైనా సరే అధికారంలోకి వస్తాం అన్నారు. మధ్యలో BJP తో తప్పక చెలిమి చేసిన పరిస్థితుల్లో కొంత డీలా పడ్డారు. కానీ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పుణ్యమా అని 140+ సీట్లు సాధిస్తాం అనే దశకు వచ్చారు. NDA కూటమిదే అధికారం అంటూ కాయ్ రాజా కాయ్, పందానికి సై అంటే సై అంటున్నారట.
పోయినసారి పసుపు కుంఖం పథకం లాగా బెడిసి కొడుతుందో లేదో చూడాలి. మే 13న ఎన్నికలు ముగిసిన తర్వాత ఓటింగ్ సరళిని బట్టి ఓడలు బళ్ళవచ్చు, లేదా బళ్ళు ఓడలు అవ్వొచ్చు. చూద్దాం ఎవరు చేతులు కాల్చుకుంటారో, ఎవరు డబ్బులు సంపాదిస్తారో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. బెట్టింగ్ బంగార్ రాజులు పారాహుషార్!