తానా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి. కోవిడ్ సేవలకు TANA తానా కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి శిరీష తూనుగుంట్ల గారికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రెడ్‌క్రాస్ అవార్డును మరియు బంగారు పతకాన్ని బహుకరించారు. అలాగే తానా సంస్థ కు కూడా బహుకరించిన రెడ్‌క్రాస్ అవార్డును మరియు బంగారు పతకాన్ని తానా టీమ్ స్క్వేర్ ఛైర్మన్ శ్రీ సురేష్ కాకర్ల (Suresh Kakarla) గారు అందుకున్నారు.
1977 సం # లో నార్త్ అమెరికా లో స్థాపించబడి తన సేవలతో విశ్వ వ్యాప్తంగా పేరు ప్రతిష్ట లు సంపాదించుకున్న తానా అరుదైన గుర్తింపుని, గౌరవాన్ని తన ఖాతా లో వేసుకుంది. ఈ అద్భుత సంఘటన కు విజయవాడ వేదికకైంది. రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ (Biswabhusan Harichandan) గారి చేతుల మీదుగా రెండు మెడల్స్ అందుకుంది.
కోవిడ్ -19 (COVID-19) కి చిక్కి ప్రజలు విలవిలాడుతున్న దురదృష్ట క్షణాల్లో, ఎప్పటిలాగే తానా, తన సహృదయతను చాటుకుంది. రెండో వేవ్ సందర్బంలో కోవిడ్ రోగులు విపరీతమైన భయాందోళనలకు గురైన సమయమది. ఒక్కసారిగా విరుచుకు పడ్డ మహమ్మారి వల్ల, బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్, ప్రాణ రక్షక మందులు తగినన్ని లభించక ప్రజలు విల విల్లాడిన తరుణ మది.
ఆనాటి అధ్యక్షులు శ్రీ జయశేఖర్ తాళ్లూరి (Jay Talluri) గారి నేత్రత్వంలో, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ శ్రీ అంజయ్య చౌదరి లావు(Anjaiah Chowdary Lavu) గారి ఆధ్వర్యంలో లో కార్యవర్గం మొత్తం కార్యోణ్ముఖ మై రంగలోకి దిగింది తానా సేవా సేన. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు తన మార్క్ ని చూపించే శ్రీమతి శిరీష తూనుగుంట్ల తన ఎన్నికల పని కూడా ప్రక్కన పెట్టి రేయింబవళ్ళు కష్ట పడి పనిచేశారు.
24 గంటలు రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉండే విధంగా తానా తరపున ప్రత్యేక వెబ్సైటును అందుబాటులోకి తెచ్చి హెల్ప్ లైన్ (Helpline) ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాల్లో ఏ హాస్పిటల్లో బెడ్స్, ఆక్సిజన్ వసతి, మందులు దొరుకుతున్నాయో వివరాలు కూడా ఇచ్చారంటే తానా ఎలా పనిచేసిందో ఎవరైనా ఊహించుకోవచ్చు.
రెండు రాష్ట్రాల రోగులకు సహాయ సహకారాలు అందించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో తానా రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారి సమన్వయం తో ఈ మహా యజ్ఞాన్ని నిర్వహించింది. 40000 మెడికల్ కిట్స్, 650 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, 120 వెంటిలేటర్స్ రెడ్ క్రాస్ ద్వారా రోగులకు పంపిణి చేసింది. వాటితో పాటు నిత్యావసర సరుకులు, మాస్కులు అందజేసి ఎంతో మందిని ఆదుకుంది తానా. ఈ విశిష్ట సేవల్ని గుర్తించి తానా సంస్థ కు, ఈ సేవా కార్యక్రమ నిర్వాహణలో కీలక భూమిక పోషించిన శ్రీమతి శిరీష తూనుగుంట్ల గారికి విశిష్ట సేవా గోల్డ్ మెడల్స్ ప్రకటించింది.
విదేశాల్లో ఉండి కూడా తమ మాతృ గడ్డ పై మమకారం తగ్గక పోవడమే కాకుండా ఆపద, అవసరాల్లో మేము మీకు అండగా ఉంటామని ప్రపంచానికి ప్రకటించిన సేవామూర్తులకు ఇది తగిన గుర్తింపుగా పలువురు ప్రశంశలు కురిపిస్తున్నారు. అక్టోబర్ నెల 28 వ తేదీ నాడు జరిగిన పురస్కారాల ప్రధాన సభలో రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వ భూషణ్ హరిచందన్ గారు విజయవాడ లోని ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్ జరిగిన బ్రహ్మాండ మైన సభలో ఈ అవార్డులు అందజేశారు. తానా తరుపున శ్రీ కాకర్ల సురేష్ గారు, శ్రీమతి శిరీష తూనుగుంట్ల తరపున ఆమె తండ్రి శ్రీ మిట్టపల్లి పాండు రంగారావు గారు ఈ అవార్డులు అందుకున్నారు.