ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) ఆంధ్రులచే ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కోసం హరి మోటుపల్లి ఆధ్వర్యం లో స్థాపించబడిన మొదటి, ఏకైక జాతీయ స్థాయి సంస్థ. AAA పెన్సిల్వేనియా () రాష్ట్రంలో ఏర్పడింది. ఆపై 10 రాష్ట్రాలకు విస్తరించింది. టీంకు జాతీయ నాయకత్వాన్ని తీసుకురావడానికి సమయం ఆసన్నమైంది. తెలుగువారందరికీ AAA జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వారిని పరిచయం చేశారు.
గిరీష్ ఇయ్యపు గురించి
ఆంధ్రప్రదేశ్ లోని ఉక్కు నగరం వైజాగ్‌లో జన్మించి, ప్రస్తుతం న్యూజెర్సీలో నివసిస్తున్న గిరీష్ ఇయ్యపు బోర్న్ లీడర్ అంటే ఏమిటో చూపించారు. బాల్యం నుంచే గొప్ప విజన్ తో నాయకత్వ పటిమని ప్రదర్శించారు. అద్భుత నాయకత్వంతో వ్యక్తిగత విజయాలతో పాటు తన దార్శనికతో దిశను నిర్దేశించారు. గిరీష్ క్రియేటివిటీ అతను చేపట్టే ప్రతి ప్రాజెక్ట్‌లో చెరగని ముద్రవేసింది. గిరీష్ దూరదృష్టి గల నాయకత్వం కారణంగా, AAA న్యూ జెర్సీ (NJ) శ్రావణ మహోత్సవాల కార్యక్రమంలో 3,500 మందికి పైగా పాల్గొని రికార్డును సృష్టించింది.
AAA న్యూజెర్సీ (New Jersey) లో ఒక ప్రముఖ సంస్థగా విస్తరించబడింది. ఆస్టిన్, టెక్సస్ చార్టర్ స్థాపనలో గిరీష్ కీలక పాత్ర పోషించారు. ఇతర తెలుగు సంస్థలు AAA తో కలిసి పనిచేయడంలో గిరీష్ కీలక పాత్ర పోషించారు. తద్వారా వారు కలిసి ముందుకు సాగడానికి వీలు కల్పించారు. ఇతరుల అవసరాలను తీర్చడంలో అతని సహకారం, నిబద్ధత నిజంగా సహృదయ వాతావరణాన్ని సృష్టిస్తుంది. గొప్ప నైపుణ్యం కలిగిన వక్తగా, స్ఫూర్తిని నింపే సామర్ధ్యం అతని సొంతం.
ఐటీ కన్సల్టింగ్ మరియు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు వంటి గొప్ప వ్యాపార నైపుణ్యాలను కలిగిన ఆయన అదే సమయంలో సామాజిక సేవాకార్యక్రమాలలో ముందుజలో వున్నారు. తన స్వగ్రామంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యునైటెడ్ స్టేట్స్ అంతటా అనేక NGO లకు మద్దతునిచ్చారు. యాదవ సంఘానికి ఆయన చేసిన కృషి, తనకు రాష్ట్ర స్థాయి క్రికెట్ ప్లేయర్‌గా ఉన్న అనుభవంతో క్రీడలకు సపోర్టు మరియు స్పాన్సర్షిప్ అందించడం వంటి పనులు ఆయనను వ్యక్తిగతంగా ఉన్నతంగా ముందుంచింది.
AAA గురించి
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) ఆంధ్ర ప్రదేశ్ యొక్క ప్రధాన సంస్కృతి, వారసత్వాన్ని ప్రోత్సహించడానికి ఆంధ్ర ప్రజలచే USA లో ఏర్పడిన ఒక లాభాపేక్షలేని సంస్థ. కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లాల వరకు ఆంధ్రులందరినీ అమెరికాలో ఒక్కతాటిపైకి తీసుకురావడమే లక్ష్యం. ఇది పూర్తిగా సాంస్కృతిక ఆధారితమైనది. భారతదేశంలో జరుపుకునే పండుగలలో ఆంధ్రులందరూ పాల్గొనాలని కోరుకుంటున్నారు. మా దృష్టి ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని మన పిల్లలకు ప్రపంచానికి చూపడం.
AAA ఈవెంట్‌లు & వేడుకలలో భాగంగా మన పిల్లలను పాల్గొనడం, ఆపై వారు మా తరువాతి తరం నాయం. లేకుంటే, మనం మన పండుగలను మరచిపోవచ్చు, మన పిల్లలకు మన ఆంధ్ర ప్రదేశ్ సంస్కృతి, పండుగలు, కళలు, ఆహారపు అలవాట్లు, కట్టుబాట్లు తెలియకపోవచ్చు. మన తర్వాతి తరాలు USA లో మన ఇతర ప్రాంతీయ పండుగలు మన సంప్రదాయంగా భావిస్తూ పెరుగుతాయి. మన ఆంధ్ర ప్రదేశ్ సంస్కృతిని కాపాడటం, USA లోని మన తర్వాతి తరాలతో పంచుకోవడం మన బాధ్యత.
ఈ సందర్భంగా AAA (Andhra Pradesh American Association) నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గిరీష్ ఇయ్యపు (Girish Eyyapu) కి స్వాగతం పలుకుదాం. ఆయన నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్‌ను కొత్త శిఖరాలకు ఎదగడానికి మన అందరి సహాయ సహకారాలు అందజేద్దాం.