ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) సభ్యులతో లాస్ వేగాస్ చార్టర్ ను సెప్టెంబర్ 28, 2024 న పార్టీ హాల్ లో ఘనంగా ప్రారంభించారు. లాస్ వేగాస్ చార్టర్ (Las Vegas Charter) అధ్యక్షుడిగా మోహన్ ఆచంట గారి నేతృత్వంలో మీట్ అండ్ గ్రీట్ (Meet & Greet) కార్యక్రమంను విజయవంతంగా జరుపుకుంది.
ఇది AAA సంస్థకు ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ లో లాస్ వేగాస్ చాప్టర్ ని ప్రారంభించినందుకు అక్కడి అధ్యక్షుడు మోహన్ ఆచంట (Mohan Achanta) గారు AAA నాయకులకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. లాస్ వేగాస్ (Las Vegas) లో ప్రవాసాంధ్రులు పెరగటంతో ఇది మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు.
ఇదివరకు ఎన్నడూ జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ లాంటి పెద్ద సంస్థని లాస్ వేగాస్ లో ప్రారంభించాలనే ఆలోచన హరి మోటుపల్లి గారి దూరదృష్టికి నిదర్శనం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) విధి విధానాల గురించి తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సంస్కృతి మరియు సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు తెలియచేయటమే వారి ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాల ప్రాముఖ్యతపై చర్చలు జరుగగా, హాజరైన వారు కూడా వారి విలువైన అభిప్రాయాలు మరియు సూచనలు ఇయ్యటంతో AAA నాయకత్వ బృందం వాటిని ఉత్సాహంతో స్వాగతించింది. AAA నాయకత్వ బృందం ఈ సూచనలను గౌరవిస్తూ, ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ద్వారా మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
హాజరైన AAA నాయకత్వ బృందం: హరి మోటుపల్లి (AAA వ్యవస్థాపకులు), బాలాజీ వీర్నాల (జాతీయ అధ్యక్షుడు), గిరీష్ ఇయ్యపు (జాతీయ అధ్యక్షుడు – ఎలెక్ట్), రవి చిక్కాల (గవర్నింగ్ బోర్డు), వీరభద్ర శర్మ కూనపులి (Pennsylvania చార్టర్ అధ్యక్షుడు) మరియు శ్రీనివాస్ అడ్డా (Pennsylvania చార్టర్ ప్రెసిడెంట్ – ఎలెక్ట్).
ఈ కార్యక్రమంలో హరి మోటుపల్లి (Hari Motupalli) గారు వెంకట రామకృష్ణ బొల్లి ని లాస్ వేగాస్ చార్టర్ ప్రెసిడెంట్ – ఎలెక్ట్ గా నియమించడం జరిగింది. ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంకు కృషి చేసిన కోర్ బృంద సభ్యులు, మోహన్ ఆచంట గారికి, వెంకట రామకృష్ణ బొల్లి గారికి, AAA వ్యవస్థాపకులు హరి మోటుపల్లి, మరియు AAA నాయకత్వ బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (Andhra Pradesh American Association – AAA) లాస్ వేగాస్ చార్టర్ (Las Vegas Charter) కోర్ బృంద సభ్యులు: ఇర్ఫాన్ మహ్మద్, మాధవ్, సత్య, అంజి, రామన్, వైధిక్, అనిల్, కార్తీక్, అర్షద్, రెంజి, మరియు వెంకీ.