Connect with us

Events

45+ వంటకాలతో ఉచిత భోజనం, కోటి కాన్సర్ట్ @ AAA Atlanta Chapter సంక్రాంతి సంబరాలు, Cumming

Published

on

ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (Andhra Pradesh American Association – AAA) గత సంవత్సరం అట్లాంటా చాప్టర్ ని ఘనంగా ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ AAA అట్లాంటా చాప్టర్ (Atlanta Chapter) మొట్టమొదటి కార్యక్రమం సంక్రాంతి సంబరాలు జనవరి 12, వచ్చే ఆదివారం రోజున సాయంత్రం 4 గంటల నుండి నిర్వహిస్తున్నారు.

కమ్మింగ్ (Cumming, Georgia) పట్టణం లోని వెస్ట్ ఫోర్సైత్ హై స్కూల్ లో నిర్వహిస్తున్న ఈ సంక్రాంతి సంబరాలలో టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకులు కోటి (Tollywood Music Director Koti) సారధ్యంలోని గాయనీగాయకులు శ్రీకాంత్ సండుగు, అఖిల, శృతి నండూరి, బీజీ ష్రిడి మరియు సందీప్ కూరపాటి మ్యూజికల్ కాన్సర్ట్ (Concert) తో అలరించనున్నారు.

AAA (Andhra Pradesh American Association) అట్లాంటా చాప్టర్ ప్రెసిడెంట్ కమల్ బారవతుల (Kamal Baravathula) ఆధ్వర్యంలో కార్యవర్గ బృందం చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి RSVP తప్పనిసరి. RSVP చేసుకున్నవారికి 45 కి పైగా ఆంధ్ర వంటకాలతో ఉచిత పండుగ భోజనం ప్రత్యేకం. స్పాన్సర్షిప్ వివరాలకు క్రింది ఫ్లయర్ చూడండి.

ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ అట్లాంటా చాప్టర్ (AAA Atlanta Chapter) మొట్టమొదటి ఈవెంట్ కావడం, ఫ్రీ ఈవెంట్ కావడం, 45 కి పైగా వంటకాలతో ఉచిత పండుగ భోజనం ఏర్పాటు చేయడం, ప్రముఖ సంగీత దర్శకులు కోటి మ్యూజికల్ కాన్సర్ట్ ఉండడం, లీడర్షిప్ లో అందరూ యువత ఉండడం వంటి కారణాలతో ఈ కార్యక్రమం ప్రాధాన్యతను సంతరించుకుంది.

error: NRI2NRI.COM copyright content is protected