ఆయుర్వేద ఔషధం కనిపెట్టిన ఆనందయ్య ఆశయం అది ప్రతిఒక్కరికీఅందాలిఅని. ఉచితంగా తయారుచేసి పంచడానికి కూడా తను రెడీ అన్నారు. అయితే వైసీపీ నేతల దెబ్బకి ఇప్పుడు ఆ పరిస్ధితి కనిపించడం లేదు. హైకోర్టు అనుమతుల క్రమంలో ఆనందయ్య మందులు పంపిణీ చేస్తారని పది రోజులుగా ఎదురుచూస్తున్న కరోనా బాధితులకు నిరాశే మిగిలింది. కోట్లల్లో డబ్బులు చేసుకోవచ్చన్న కక్కుర్తితో ఔషధాన్ని వైసీపీ నేతల గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. వైసీపీ నేతల ఫొటోలు సైతం ఔషధడబ్బాలపై దర్శనమిస్తున్నాయి. మందు తయారు చేసిన ఆనందయ్యను పక్కకు నెట్టి ప్యాకెట్ల మీద జగన్ రెడ్డి, అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫొటోలతో వారి సొంత నియోజకవర్గాల్లో మాత్రమే పంపిణీ చేస్తూ, సామాన్యులకు అందకుండా రాజకీయం చేస్తున్నారు. దీంతో ఆనందయ్య గవర్నర్, డీజీపీలకు లేఖలు రాశారు. శవాలమీద చిల్లర వేరుకొనే ఈ వైసీపీ నేతలు ఎప్పటికి మారతారో!