Connect with us

Sports

అట్లాంటాలో ఆటా బ్యాడ్మింటన్ పోటీలకు మంచి స్పందన: American Telugu Association

Published

on

Membership Drive మరియు Badminton Tournament ల సందడ్లతో సెప్టెంబర్ 23 & 24, 2023 న మరో ఉత్సాహభరిత వారాంతాన్ని, ఉల్లాసభరిత వాతావరణాన్ని నెలకొల్పిన ATA, Atlanta. Membership Drive ద్వారా సభ్యత్వం పొందిన నూతన సభ్యుల ప్రశంసల అనూహ్య స్పందన, ATA సంస్థ అట్లాంటా కార్యవర్గాన్ని మరింత ఉత్సుకతతో కార్యనిమజ్ఞులయ్యే విధంగా ప్రోత్సహించింది.

తెలుగు వారు కనపరచిన ఆత్మీయ అభిమానానికి మరియు అనిర్వచనీయ సహకారానికిగానూ ATA కార్యవర్గం హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపింది. సకల సన్నాహాల నడుమ అత్యద్భుత నిర్వహణలో ATA బ్యాడ్మింటన్ టోర్నమెంట్ రూపొందగా ఎనలేని క్రీడాస్ఫూర్తితో ఆ సాయంకాలాన్ని హోరెత్తించిన అట్లాంటా ఆటగాళ్ల ఆటతీరు హర్షణీయం.

సెప్టెంబరు 24న అట్లాంటా బ్యాడ్మింటన్ క్లబ్ న నెలకొన్న ఈ టోర్నమెంట్లో పాల్గొన్న ఆటగాళ్లు తమ స్నేహపూర్వక వైఖరితో మరియు సాటిలేని సామర్థ్యాలతో ఆసాంతం అందరినీ అబ్బురపరిచారు అనడంలో అతిశయోక్తి లేదు.

సంకల్ప సిద్ధులై సదా కార్యనిమజ్ఞులై కార్యక్రమాలను గొప్పగా నిర్వహించిన ATA, అట్లాంటా RC లు కిషన్, సందీప్ మరియు గణేష్ లు, నేషనల్ టీం నిరంజన్ పొద్దుటూరి, శివ రామడుగు, JC మరియు కాన్ఫరెన్స్ టీం కరుణాకర్ అసిరెడ్డి, అనిల్ బొడ్డిరెడ్డి, శ్రీధర్ T, శ్రీరామ్ & అనంత్ C లను ATA సంస్థ ప్రత్యేకంగా అభినందించింది.

American Telugu Association (ATA) లో చేరిన నూతన సభ్యులకు, టోర్ణమెంట్ లోని విజేతలకు మరియు పాల్గొన్న ఔత్సాహికులకు ATA అభిమాన పూర్వక అభినందనలు తెలియచేసింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected