అమెరికా తెలుగు సంఘం (American Telugu Association) ‘ఆటా’ 18వ కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా (Atlanta) మహానగరంలో నిర్వహించనున్నారు. గతంలో కూడా 2000, 2012 సంవత్సరాలలో ఆటా కన్వెన్షన్ అట్లాంటాలో విజయవంతంగా నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే.
వచ్చే సంవత్సరం 2024 జూన్ 7, 8, 9 తేదీలలో అంటే సుమారుగా 12 ఏళ్ళ తర్వాత ముచ్చటగా మూడోసారి అట్లాంటాలో ఆటా కన్వెన్షన్ (Convention) నిర్వహిస్తున్నట్లు అయ్యింది. అట్లాంటాలో ఆటా 18 వ కన్వెన్షన్ జరపాలని గత మే 6న డాలస్ లో నిర్వహించిన బోర్డు సమావేశంలోనే పాలకమండలి సభ్యు లు నిర్ణయించారు.
ఆటా చరిత్రలో రెండవ మహిళా అధ్యక్షురాలు మధు బొమ్మినేని (Madhu Bommineni) అధ్యక్షతన, కిరణ్ పాశం కాన్ఫరెన్స్ కన్వీనర్ గా, సాయి సుధిని నేషనల్ కోఆర్డినేటర్ గా, శ్రీధర్ తిరుపతి కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ గా మరియు అనీల్ బొద్దిరెడ్డి కాన్ఫరెన్స్ డైరెక్టర్ గా జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ లో ఘనంగా ఆటా 18వ కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ నిర్వహిస్తారని నిన్న అధికారికంగా ప్రకటించారు.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో కోవిడ్ అనంతరం గత ఆటా అధ్యక్షులు భువనేశ్ బూజల హయాంలో ఆటా 17వ కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాయి. ఈ 18వ కన్వెన్షన్ కూడా మధు బొమ్మినేని అధ్యక్షతన అంతకంటే ఎక్కువ విజయం సాధించాలని, సంస్థాపరంగా ఆటా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలని కోరుకుంటూ NRI2NRI.COM నుంచి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం.