. ATA చరిత్రలో మొట్టమొదటిసారి నాన్ స్లేట్ డామినేషన్
. లైఫ్ మెంబర్షిప్ కేటగిరీలో మిక్స్డ్ ఫలితాలు
. అట్లాంటా చాప్టర్ బలం చెప్పకనే చెప్పిన వైనం
. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా మొదటి స్థానంలో న్యూ జెర్సీ వాసి సంతోష్ కోరం
. ఓట్ల పరంగా రెండవ స్థానంలో అట్లాంటా వాసి శ్రీధర్ తిరుపతి
. కొందరు ఇటు స్లేట్ అటు నాన్ స్లేట్ నుంచి రెండు వైపులా ఓట్లు దండుకున్న తీరు రాజకీయ చతురతే
. NRI2NRI.COM ద్వారా ప్రొఫైల్ ప్రమోట్ చేయించుకున్న అభ్యర్థుల్లో 80% విజయం
. నాన్ స్లేట్ లో కొందరి ఐక్యత విజయానికి సోపానం
. ఆసక్తికరంగా ప్యాట్రన్ & గ్రాండ్ ప్యాట్రన్ కేటగిరీ ఫలితాలు
2025-28 పదవీ కాలానికి సంబంధించి అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఎన్నికలు డిసెంబర్ 20న ముగియడంతో 21 రాత్రికి కౌంటింగ్ అనంతరం ఫలితాలు బయటకు వచ్చాయి. బయటకి చూడడానికి చిత్రమైన ఫలితాలు అనిపించేలా ఉన్నప్పటికీ, అమెరికాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ఓట్ల బలం, బలగం చూస్తే NRI2NRI.COM చెప్పినట్లు ఊహించిన ఫలితాలే అన్నట్టు ఉన్నాయి.
లైఫ్ మెంబర్షిప్ కేటగిరీలో 9 బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (ATA Board of Trustees) పదవులకు గాను, నలుగురు స్లేట్ (ATA Election Committee Recommended Candidates) నుంచి గెలవగా ఐదుగురు నాన్ స్లేట్ నుంచి గెలిచారు. Slate నుంచి గెలిచిన వారిలో సంతోష్ కోరం (New Jersey), శ్రీధర్ తిరుపతి (Atlanta), శ్రీధర్ కంచరకుంట్ల (Houston) మరియు సుధీర్ బండారు (Virginia) ఉన్నారు.
నాన్ స్లేట్ నుంచి గెలిచిన వారిలో విజయ్ రెడ్డి తూపల్లి (Los Angeles), విజయ్ కుందూర్ (New Jersey), విష్ణు మాధవరం (Virginia), RV రెడ్డి (Chicago) మరియు శ్రీనివాస్ శ్రీరామ (Atlanta) ఉన్నారు. అట్లాంటా, న్యూ జెర్సీ మరియు వర్జీనియా నుండి ఇటు స్లేట్ అటు నాన్ స్లేట్ అభ్యర్థులు గెలవడం రాజకీయ చతురత అనుకోవాలి.
ఆటా అట్లాంటా చాప్టర్ (ATA Atlanta Chapter) బలం చెప్పకనే చెప్పినట్లయింది. ఈ మధ్యనే కనెన్షన్ నిర్వహించడం, ఆటా సభ్యత్వాలు పెరగడం కలిసొచ్చింది. నాన్ స్లేట్ లో ఉన్న కొందరు అభ్యర్థులకు వోట్ వేయమని ఒక ప్రముఖ నాయకుడు బహిరంగంగానే ఈమెయిల్ మరియు మెసేజెస్ పంపిన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఇక్కడ కూడా కొంచెం క్రాస్ వోటింగ్ జరిగినట్లు ఫలితాలను బట్టి చూస్తే అర్ధం అవుతుంది.
అందరికంటే ఎక్కువ ఓట్లతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా న్యూ జెర్సీ (New Jersey) వాసి సంతోష్ కోరం నిలిచారు. ఓట్ల పరంగా రెండవ స్థానంలో అట్లాంటా (Atlanta) వాసి శ్రీధర్ తిరుపతి ఉన్నారు. మొదటి మూడు స్థానాలలో నిలిచిన సంతోష్ కోరం, శ్రీధర్ తిరుపతి, శ్రీధర్ కంచరకుంట్ల కు మిగతావారికి వచ్చిన ఓట్ల వ్యత్యాసం చూస్తే ఇటు స్లేట్ అటు నాన్ స్లేట్ నుంచి రెండు వైపులా ఓట్లు దండుకున్న విషయం స్పష్టమవుతుంది.
NRI2NRI.COM ద్వారా ప్రొఫైల్ ప్రమోట్ చేయించుకొని ఆటా (American Telugu Association – ATA) ఓటర్లకు చేరువైన అభ్యర్థుల్లో 80 శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించడం విశేషం. నాన్ స్లేట్ లో ఉన్న కొందరు అభ్యర్థులు ఐక్యంగా పోరాడడంతో విజయం నల్లేరుపై నడకలా మారింది. అందుకే వీరందరికీ కొంచెం అటు ఇటుగా సమానంగా ఓట్లు వచ్చాయి.
కొందరు స్లేట్ (Slate) అభ్యర్థులకు మరికొందరు నాన్ స్లేట్ (Non Slate) అభ్యర్థులకు ఓట్ల వ్యత్యాసం ఆలోచించదగిన విషయం. సుధీర్ బండారు తృటిలో గెలుపును చేరుకున్నట్లు ఫలితాలను విశ్లేషిస్తే స్పష్టంగా అర్ధం అవుతుంది. మొత్తంగా ఆటా (ATA) చరిత్రలో మొట్టమొదటిసారి నాన్ స్లేట్ లో ఇంతమంది గెలవడం కొసమెరుపు.
గ్రాండ్ ప్యాట్రన్ (Grand Patron) కేటగిరీలో ముగ్గురూ స్లేట్ నుంచే గెలిచారు. కానీ ప్యాట్రన్ (Patron) కేటగిరీలో ఒకరు స్లేట్ నుంచి, ఇద్దరేమో నాన్ స్లేట్ నుంచి గెలిచారు. దీంతో 2025-28 పదవీ కాలానికి సంబంధించిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (American Telugu Association – ATA) ఎన్నికలు మరియు ఫలితాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
Life Category Winners
- Santosh Koram
- Sreedhar Kanchankuntla
- Sridhar Tirupathi
- Sudheer Bandaru
- RV Reddy
- Srinivas Srirama
- Vijay Kundur
- Vishnu Madhavaram
- Vijay Reddy Thupally
Patron Category Winners
- Sharada Singireddy
- Ravinder K. Reddy
- Ven Reddy
Grand Patron Category Winners
- Kashivishwanatha Reddy Kotha
- Ram Mattapalli
- Sridhar Banala