Connect with us

Leadership

ATA లో చక్కబడ్డ పరిస్థితులు; అధ్యక్షునిగా జయంత్ చల్లా, ఉత్తరాధ్యక్షునిగా సతీష్ రెడ్డి సారధ్యంలో కొలువు దీరిన కార్యవర్గం

Published

on

Las Vegas: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) నూతన అధ్యక్షుడిగా  జయంత్ చల్ల బాధ్యతలు స్వీకరించారు. లాస్ వేగాస్ లోని సీసర్స్ ప్యాలస్ (Caesars Palace) లో శనివారం జనవరి 18, 2025 న జరిగిన ఆటా (ATA) పాలకమండలి సమావేశంలో ప్రస్తుత అధ్యక్షురాలు మధు బొమ్మినేని (Madhu Bommineni) చేతుల మీదుగా వర్జీనియా (Virginia) ప్రాంతానికి చెందిన  జయంత్ చల్ల (Jayanth Challa) నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సమావేశానికి అమెరికా లోని వివిధ ప్రాంతాల నుండి ఆటా (ATA) సలహాదారులు, మాజీ అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్స్, స్టాండింగ్ కమిటీస్, ఆటా  సభ్యులు, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు.  2024 డిసెంబర్ లో ఆటా లోని  15 పాలక మండలి (BOT) స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికైన సభ్యులు 2025  నుండి 2028 సంవత్సరం వరకు పదవిలో కొనసాగనున్నారు.

రామిరెడ్డి వెంకటేశ్వర, ఆర్.వి రెడ్ది, శ్రీధర్ కాంచనకుంట్ల,సుధీర్ బండారు, విజయ్ కుందూర్, విష్ణు మాధవరం, సంతోష్ రెడ్డి కోరం, శ్రీధర్ తిరుపతి, శ్రీనివాస్ శ్రీరామ, విజయ్ రెడ్డి తూపల్లి, రవీందర్ కె రెడ్డి, శారద సింగిరెడ్డి, వెంకట్ (వెన్) రెడ్డి రావి, కాశివిశ్వనాథ్ రెడ్డి కొత్త, రాం మట్టపల్లి, శ్రీధర్ బాణాల పాలక మండలి (Board of Trustees) సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరందరు వారి భాద్యతలను, క్రమశిక్షణతో, నిభద్దతో పాటిస్తామని, సంస్థను విజయపథంలో ముందుకు నడిపిస్తామని ప్రమాణస్వీకరాం చేసారు.

జనవరి 18, మార్చ్ 8, మార్చ్ 23 వ తేదిలలో జరిగిన బోర్ద్ సమావేశాలలో ATA పాలక మండలి (BOT) సభ్యులు 2025 నుండి 2026 గడువుకు సతీష్ రెడ్డిని (Satish Reddy) ఉత్తరాధ్యక్షుడిగా, సాయినాథ్ బోయపల్లి (Sainath Boyapalli) ని కార్యదర్శిగా, శ్రీకాంత్ రెడ్డి గుడిపాటి (Srikanth Reddy Gudipati) ని కోశాధికారిగా, శారద సింగిరెడ్డి ని సంయుక్త కార్యదర్శిగా, విజయ్ రెడ్డి తూపల్లి ని సంయుక్త కోశాధికారిగా , కార్య నిర్వాహక దర్శకుడిగా నర్సిరెడ్డి గడ్డికొప్పుల ని. మరియు అరవింద్ రెడ్డి ముప్పిడి ని కార్యనిర్వాహక కమిటీ కి సలహాదారునిగా ఎన్నుకున్నారు..

ఉన్నతమైన భావాలతో, సహృదయముతో పాలక మండలి సభ్యులు అనిల్ బొద్ది రెడ్డి (Anil Boddireddy) ఆటా ఐక్యత, ఉన్నతి కోసం, మరింత ధృడంగా పనిచేస్తానని ప్రస్తుతము పాలకమందలి సభ్యుడిగానే సేవలు, ప్రాయోజనాత్మక కార్యక్రమాలు కొనసాగిస్తానని, మునుముందుగా ఉత్తరాధ్యక్షుడి (President-Elect) పదవి కి ఆకాంక్ష తెలియచేయగా పాలక మండలి సభ్యులు హర్షధ్వానాలతో అభినందనలు వ్యక్తం చేశారు.

అధ్యక్షుడు జయంత్ చల్ల (Jayanth Challa) మాట్లాడుతూ, ఆటా సంస్థలో సేవా, సాంస్కృతిక, విద్యా, సామాజిక కార్యక్రమాలను ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా యువతరాన్ని భాగస్వామ్యం చేయడం, ATA కార్యక్రమాలను విస్తరించడం, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించడం తమ ప్రాధాన్య కార్యక్రమాలుగా పేర్కొన్నారు.

ATA SEVA విభాగానికి అవసరమైన వనరులను సమకూర్చడం, ఆరోగ్య కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఆటా ముందున్న ముఖ్య లక్ష్యాలుగా పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలుగా ‘ఆటా’ కు సేవలందించిన అధ్యక్షురాలు మధు బొమ్మినేని ని, కార్య నిర్వాహక, మరియు కార్యవర్గ బృందాన్ని అభినందించారు.

error: NRI2NRI.COM copyright content is protected