అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (American Progressive Telugu Association) ‘ఆప్తా’ అమెరికాలో ఒక సువర్ణాద్యాయం తెలుగు ప్రజలలో లిఖించింది. జూన్ 17, 2023 తేది శనివారం పదకొండు రాష్ఠాలలో సుమారు పదిహేను వందల ఆప్తులు ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే 5కె రన్నింగ్ లో పాల్గొన్నారు.
ఆప్తుల మానసిక ఉల్లాసం పెంచుకోవడం, మానసిన వత్తిడులను తట్టుకోవడం, ప్రశాంతమైన జీవన విధానం అలవరుచుకోవడం మరియు కుటుంబం, స్నేహితులతో ఆహ్లాదకరంగా గడపడం కోసం అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (APTA) వారి ఆప్త స్పోర్ట్స్ నేషనల్ టీం ఆద్వర్యంలో ఎంతో సందడిగా జరిగింది.
దీనికి స్పోర్ట్స్ టీం చైర్ శేఖర్ కత్తి, కో-చైర్ రాజేష్ కటికి మరియు ఇతర కో-ఆర్డినేటర్స్ ఎంతో సమిష్టిగా క్రమశిక్షణతో విజయవంతం చెయ్యడంలో సఫలీకృతులయ్యారు. సురేష్ కరోతు గారు టీషర్ట్స్ డిజైన్స్ చేసి ప్రింట్ చెయ్యడంలో మరియు వేణు తోట గారు గరుడవేగలో ఇండియా నుంచి తీసుకొని రావడంలో సహాయసహకారాలు అందించారు.
ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో వివిద రీజియన్ ఆర్విపిలు, ఆప్తా బోర్డ్ మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ఆప్తా 2023 కన్వెన్షన్ టీం మరియు వందమంది వాలంటీర్స్ తమ విలువైన సమయాన్ని వెచ్చించారు. అలాగే స్పాన్సర్స్ ముందుకు వచ్చి ఆప్తా (APTA) వెన్నంటి నిలిచి ఆర్ధిక సహాయం అందించారు.
వివిద రాష్ఠాలలో 5కె రన్లో పాల్గొన్న ఆప్తుల సంఖ్య:
అట్లాంట (జార్జియా) – 230
ఆల్డి (వర్జీనియా) 180
రిచ్మండ్ (వర్జీనియా) – 50
న్యూ ఇంగ్లాండ్ -170
డల్లాస్ (టెక్సాస్) – 125
హ్యూస్టన్ (టెక్సాస్) – 80
ఆస్టిన్ (టెక్సాస్) – 80
ఫార్మింగ్టన్ (మిచిగన్) – 120
కొలంబస్ (ఒహాయి) – 60
మినియాపోలిస్ (మిన్నెసొట) – 80
చికాగొ (ఇల్లినాయిస్) – 100
పరుగు కేవలం శరీరానికి మాత్రమే ఎక్సర్‌సైజ్ కాదు, మైండ్‌కి కూడా అది ఎంతో మేలు చేస్తుంది అని నిరూపించారు అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (American Progressive Telugu Association – APTA) సభ్యులు. సుమారు 6000 కిలోమీటర్స్ సుమారు 1500 ఆప్తులు కవర్ చెయ్యడం జరిగింది.
స్పాన్సర్స్:
ఫణి తాళ్లూరు
శ్రీని బైరెడ్డి
నవీన్ ఎర్రబోలు
చంద్ర శేఖర్ నల్లం
కుమార్ వూటకూరి
సత్య బల్ల
శ్రీధర్ వన్నెంరెడ్డి
శేఖర్ కత్తి
అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (American Progressive Telugu Association) ‘ఆప్తా’ మీడియా ఛైర్ చంద్ర పోలిశెట్టి మరియు ఆప్తా 2023 కన్వెన్షన్ మీడియా ఛైర్ కృష్ణ మేకల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.