రేపటి నుంచి అనగా 2024 మే 24 శుక్రవారం నుంచి 26 ఆదివారం వరకు అమెరికాలోని సియాటిల్ (Seattle Convention Center) మహానగరంలో మొట్టమొదటిసారి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్ (TTA Mega Convention) నిర్వహణకు మస్త్ ఏర్పాట్లు చేశారు.
గత కొన్ని నెలలుగా వివిధ కమిటీలు శ్రమిస్తుండగా, గత వారం నుంచి TTA నాయకులందరూ సియాటిల్ (Seattle) లో మకాం వేసి మరీ మస్త్ ప్రణాళికలు రచించారు. వీరి కష్టం రేపటినుంచి అందరి కళ్ళలో మస్తీ రూపంలో అలరించనుంది. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన TTA సేవాడేస్ ఒక ఎత్తైతే, మూడు రోజులపాటు పెద్ద పండుగలా నిర్వహించే ఈ కన్వెన్షన్ మరో ఎత్తు.
హాస్పిటాలిటీకి ఎక్కడా లోటు లేకుండా అతిథులను ఎయిర్పోర్ట్ లో పికప్ చేసుకునే దగ్గిర నుంచి కన్వెన్షన్ మూడు రోజులపాటు తెలంగాణ ఆతిథ్యం అందేలా ప్రణాళికలు రచించారు. శుక్రవారం బాంక్వెట్ డిన్నర్ (Banquet Dinner) తో ప్రారంభమై శనివారం, ఆదివారం మూడు రోజులపాటు విభిన్న కార్యక్రమాలతో సియాటిల్ కళకళలాడనున్నది.
బిజినెస్, పొలిటికల్, నెట్వర్కింగ్ సెమినార్స్, CME, యువత ప్రోగ్రామ్స్, సాహిత్య, ఆధ్యాత్మిక, మాట్రిమోనియాల్, విమెన్స్ ఫోరమ్, షాపింగ్ బూత్స్, టెకాన్, సెలెబ్రిటీ మీట్ అండ్ గ్రీట్, క్రూజ్ పార్టీ, ఫోటో బూత్స్, బ్యూటీ పాజంట్ ఫైనల్స్, TTA స్టార్ ఫైనల్స్ వంటి కార్యక్రమాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
అంతే కాకుండా మొట్టమొదటిసారి పసిఫిక్ నార్త్ వెస్ట్ (Pacific Northwest) లో మూడు వేలమంది భక్తులతో భద్రాచల శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, కల్చరల్ ప్రోగ్రామ్స్, లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్స్ (Concert) తో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇన్ సియాటిల్ (Seattle) అనేలా ఏర్పాట్లు చేశారు.
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల నుండి ముఖ్యంగా సెలెబ్రిటీలు, సినీ నటీనటులు, రాజకీయ నాయకులు, సాహిత్యవేత్తలు తరలివచ్చారు. TTA అధ్యక్షులు వంశీ రెడ్డి కంచరకుంట్ల (Vamshi Reddy Kancharakuntla) మరియు కన్వీనర్ చంద్రసేన శ్రీరామోజు ఆధ్వరంలో సియాటిల్ కన్వెన్షన్ సెంటర్ ముస్తాబైంది.
Telangana American Telugu Association (TTA) లాంటి చక్కని ప్లాట్ ఫామ్ ని ఏర్పాటుచేసిన వ్యవస్థాపకులు డా. పైళ్ల మల్లారెడ్డి (Dr. Pailla Malla Reddy), అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్ డా. విజయపాల్ రెడ్డి, కోఛైర్ డా. మోహన్ రెడ్డి పటలోళ్ళ, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి దిశానిర్దేశం చేస్తున్నారు.
మే 26 ఆదివారం రోజున గ్రాండ్ ఫినాలే (Grand Finale) లో భాగంగా తెలుగు సినిమా (Tollywood) ఇండస్ట్రీలో వరుస సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న సంగీత దర్శకులు తమన్ (Ghantasala Sai Srinivas Sivakumar) తన టీంతో లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ (Live Musical Show) చేయనున్నారు.
కన్వెన్షన్ అడ్వైజరీ కమిటీ డా. పైళ్ల మల్లారెడ్డి డా. విజయపాల్ రెడ్డి డా. మోహన్ రెడ్డి పటలోళ్ళ భరత్ రెడ్డి మాదాడి వంశీ రెడ్డి కంచరకుంట్ల
కన్వెన్షన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వంశీ రెడ్డి కంచరకుంట్ల చంద్రసేన శ్రీరామోజు నవీన్ రెడ్డి మల్లిపెద్ది గణేష్ మాధవ్ వీరమనేని మాణిక్యం తుక్కాపురం మనోహర్ బాదుకే డా. నరసింహా రెడ్డి దొంతిరెడ్డి కవితా రెడ్డి సహోదర్ రెడ్డి పెద్దిరెడ్డి డా. దివాకర్ జంధ్యం శివా రెడ్డి కొల్ల ప్రదీప్ మెట్టు ప్రసాద్ కునారపు సురేష్ రెడ్డి వెంకన్నగారి ఉషా రెడ్డి మన్నెం
కన్వెన్షన్ రీజినల్ అడ్వైజర్స్ నవీన్ గోలి మనోజ్ చింతిరెడ్డి అనీల్ ఎర్రబెల్లి డా. ద్వారకానాథ్ రెడ్డి