Connect with us

News

అమెరికాలో అతి పెద్ద మహాసభలకు అంతా సిద్ధం; All roads lead to Philadelphia TANA Convention

Published

on

. కోవిడ్ కారణంగా 4 సంవత్సరాల తర్వాత తానా 23వ మహాసభలు
. 30 తో మొదలై 70 కి చేరిన ముఖ్య కమిటీల సంఖ్య
. ముఖ్య అతిధిగా నందమూరి అందగాడు
. సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక, సాహితీ, వ్యాపార పుర ప్రముఖుల హాజరు
. ప్రతి రోజూ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ – చిత్ర, దేవి శ్రీ ప్రసాద్, ఇళయరాజా
. శకపురుషునికి శతజయంతోత్సవం
. ఎన్టీఆర్ ప్రాంగణం, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు
. ధీం-తానా ఫైనల్స్
. ‘తానా’రీమణులతో కదం తొక్కనున్న నారీ శక్తి
. 3 రోజుల పండుగలో యువత ప్రత్యేక కార్యక్రమాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో వైభవంగా నిర్వహించనున్నది. జూలై 7,8,9 తేదీల్లో జరిగే ఈ మహాసభల్లో పాల్గొనేందుకు, రాజకీయ, సినీరంగ ప్రముఖులతోపాటు సాహితీవేత్తలు, కవులు, ఇతర కళాకారులు, పారిశ్రామికవేత్తలు, మ్యూజిక్‌ డైరెక్టర్లు హాజరవుతున్నారు.

ఈ మహాసభలను ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ రవి పొట్లూరి, కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ లావు కృషి చేస్తున్నారు. ఈ మహాసభల్లో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు అతిధులు ఫిలడెల్ఫియాకు వచ్చారు.

ఈ మహాసభలకు ముఖ్య అతిధిగా నందమూరి బాలకృష్ణ గారు హాజరవుతున్నారు. సంగీత రారాజు మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా ఈ మహాసభల్లో సంగీత కచేరి చేయనున్నారు. ప్రముఖ నేపథ్య గాయని చిత్ర తన గానంతో అందరినీ పరవశులను చేయనున్నారు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతంతో అందరిని మంత్రముగ్ధులను చేయనున్నారు. భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి ‌శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు తోపాటు ఎంపీలు కనకమేడల రవీంద్ర, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, బిజెపి నాయకుడు బండి సంజయ్‌, తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, గంగుల కమలాకర్‌, పువ్వాడ అజయ్‌ పాల్గొననున్నారు.

వీరితోపాటు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డా. నూతలపాటి వెంకటరమణ, సద్గురు జగ్గి వాసుదేవ్, దాజి డా. కమలేష్‌ పటేల్, నటకిరీటీ రాజేంద్రప్రసాద్‌, మాగంటి మురళీ మోహన్‌, దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నటుడు నిఖిల్‌ సిద్దార్థ, సిద్ధూ జొన్నలగడ, విశ్వక్‌ సేన్‌, హీరోయిన్‌ శ్రీలీల, డింపుల్‌ హయాతి, లయ, ఆనంది, భవ్యశ్రీ, సుమ కనకాల, అనసూయ భరద్వాజ్‌, శ్రీకాంత్‌, శివాజీ రాజా, నాగినీడు, హైపర్ అది, అశోక్‌ కుమార్‌, సుహాస్‌, రఘుబాబు, రవి వర్మ, భరత్‌ రెడ్డి, సుధాకర్‌ కమకుల రానున్నారు.

డిఫెన్స్‌ అడ్వయిజర్‌ జి. సతీష్‌ రెడ్డి, భారత్‌ బయోటెక్‌ వ్యవస్థాపకులు, చైర్మన్‌ కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల, ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా, రాక్‌ స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు గాయనీ గాయకులు చిత్ర, ఎస్‌పి చరణ్‌, సునీత, మంగ్లీ, శ్వేత మోహన్‌, కౌసల్య, సుమంగళి, హేమచంద్ర, సింహ, గీతమాధురి, పృథ్వీ చంద్ర, సాగర్‌, రీట, మౌనిమ సిహెచ్‌, అనిరుధ్‌ సుస్వరం, ఇంద్రావతి చౌహాన్‌ తదితరులు ఈ మహాసభలకు వస్తున్నారు.

దర్శకులు, నిర్మాతలు కూడా వస్తున్నారు. దిల్‌రాజు, టి.జి. విశ్వప్రసాద్‌, అనిల్‌ రావిపూడి, నవీన్‌ ఎర్నేని, అస్కార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలను కూడా మహాసభలకు రావాల్సిందిగా తానా నాయకులు ఆహ్వానించారు.

ఈ మహాసభలను పురస్కరించుకుని ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ధీమ్‌ తానా ఒకటి. ఈ పోటీలను తానా వివిధ నగరాల్లో నిర్వహించింది. ఫైనల్‌ పోటీలను మహాసభల వేదికపై నిర్వహిస్తున్నారు. సిఎంఇ, హెల్త్‌ అండ్‌ ఇన్నోవేషన్‌, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఫ్యాషన్‌ షో వంటి కార్యక్రమాలతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.

తానా కళ్యాణమస్తు పేరుతో వివాహ వేదికను కూడా తానా ఏర్పాటు చేసింది. కాన్ఫరెన్స్‌ సందర్భంగా అమెరికాలోని వివిధ నగరాల్లో ఆటల పోటీలను కూడా నిర్వహించారు. తానా ప్రీమియర్‌ లీగ్‌ పేరుతో క్రికెట్‌ పోటీలను ఏర్పాటు చేశారు. కథాకేళీ పేరుతో కథలు చెప్పే పోటీలు నిర్వహిస్తున్నారు. తానా రీల్స్‌ పేరుతో మీ క్రియేటివిటీని వీడియో రూపంలో ప్రదర్శించే అవకాశాన్ని నిర్వాహకులు కల్పించారు.

యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే తానా స్టార్ట్‌ అప్‌ కార్యక్రమాన్ని, షార్ట్‌ ఫిలింస్‌ వంటి కార్యక్రమాలను, ప్రముఖ కవులతో సాహిత్య కార్యక్రమాలను, వ్యాపార‌ రంగ ప్రముఖులతో సెమినార్‌లు, శ్రీనివాస కళ్యాణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా మహాసభల సందర్భంగా ఏర్పాటు చేశారు.

ఈ మహాసభల నిర్వహణకోసం వివిధ రకాల కమిటీలను ఏర్పాటు చేశారు. కాన్ఫరెన్స్‌ కమిటీ సెక్రటరీగా సతీష్‌ తుమ్మల, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా రవి మందలపు, ఓవర్సీస్‌ డైరెక్టర్‌గా వంశీ కోట, మిడ్‌ అట్లాంటిక్‌ రీజినల్‌ రిప్రజెంటేటీవ్‌ సునీల్‌ కోగంటి, ట్రెజరర్‌గా భరత్‌ మద్దినేని, జాయింట్‌ సెక్రటరీగా శ్రీనివాస్‌ కూకట్ల, జాయింట్‌ ట్రెజరర్‌గా వెంకట్‌ సింగు‌ ఉన్నారు.

వీరితోపాటు అడ్వయిజరీ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో గౌతం గోలి, లక్ష్మి దేవినేని, మహేందర్‌ ముసుకు, పురుషోత్తం చౌదరి గూడె, తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ వెంకట రమణ యార్లగడ్డ ఉన్నారు. దీంతో పాటు వివిధ కమిటీలను నియమించారు.

కమిటీలు: ఆలంనై, ఆడియో వీడియో, అవార్డ్స్‌, బాంక్వేట్‌, బడ్జెట్‌, బిజినెస్‌ ఫోరమ్‌, సెలబ్రిటీ కోఆర్డినేషన్‌, సిఎంఈ, కమ్యూనిటీ ఔట్రీచ్‌, కార్పొరేట్‌ స్పాన్సర్షిప్‌, కల్చరల్‌, డెకొరేషన్స్‌, ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌, ధీమ్‌ తానా, డోనార్‌ రిలేషన్స్‌, ఎగ్జిబిట్స్‌, ఫిలిం ఫోటోగ్రఫీ, ఫుడ్‌, ఫండ్‌ రైసింగ్‌, హాస్పిటాలిటీ – ఆర్టిస్ట్స్‌, హాస్పిటాలిటీ – డోనార్స్‌, హాస్పిటాలిటీ – వీఐపీస్‌, హోటల్స్‌, ఇమ్మిగ్రేషన్‌ ఫోరమ్‌, ఇన్విటేషన్స్‌, లిటరరీ, మాట్రిమోనియాల్‌, మీడియా కమ్యూనికేషన్స్‌, పబ్లిసిటి, మెమెంటోస్‌, శాలువాలు, బౌకెట్స్‌, యన్‌.టి.ఆర్‌ సెంటినరీ సెలెబ్రేషన్స్‌, యన్‌.టి.ఆర్‌ ఫోటో ఎగ్జిబిషన్‌, ఓవర్సీస్‌ కోఆర్డినేషన్‌ – ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ, పాఠశాల కంపిటిషన్స్‌, పొలిటికల్‌ ఫోరమ్‌ – ఆంధ్ర ప్రదేశ్ ‌- తెలంగాణ, పొలిటికల్‌ ఫోరమ్‌ – యూఎస్‌ఏ, ప్రోగ్రాం గైడ్‌, పబ్లిసిటి అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌, రిసెప్షన్‌, రీజినల్‌ కాన్ఫరెన్స్‌ కమిటీ, రిజిస్ట్రేషన్‌, సెక్యూరిటీ, సీనియర్‌ సిటిజెన్‌ ఫోరమ్‌, సైట్‌ సీయింగ్‌, సౌవెనీర్‌, స్పిరిట్యుయల్‌, స్పోర్ట్స్‌, స్టేజి కోఆర్డినేషన్‌, టెక్నాలజీ – యాప్‌/వెబ్సైటు, టిక్‌ టాక్‌ అండ్‌ షార్ట్‌ ఫిలిం, ట్రాన్స్పోర్టేషన్‌, ట్రావెల్‌, టీటీడీ కళ్యాణం, యూఎస్‌ డిగ్నిటరీస్‌ కోఆర్డినేషన్‌, వెన్యూ కోఆర్డినేషన్‌, వాలంటీర్‌ , వెబ్‌ , ఉమెన్స్‌ ఫోరమ్‌, యూత్‌ ఫెస్ట్‌, యూత్‌ ఫోరమ్‌ తదితర కమిటీలను ఏర్పాటు చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected