Connect with us

News

హిల్స్ బొరో నదీ నడుఒంపుల్లో షురూ కానున్న NATS Convention, ఏర్పాట్లు పూర్తి: Tampa, Florida

Published

on

నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (North America Telugu Society – NATS) ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ 8వ నాట్స్ కన్వెన్షన్ తెలుగు భాష, కళలు, సంస్కృతీ సంప్రదాయాల తోపాటు వినోదానికి పెద్ద పీట వేశారు.

నాట్స్ కన్వీనర్ & పాస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda), నాట్స్ ప్రస్తుత బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి (Srihari Mandadi) మరియు నాట్స్ ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి (Madan Pamulapati) సారధ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

డెకొరేషన్, స్టేజ్ సెటప్, భోజన ఏర్పాట్ల ప్రదేశం, వెండర్ బూత్స్ ఏర్పాట్లు, ఆడియో వీడియో సెటప్ వంటి పలు విభాగాలకు సంబందించిన పనులు దగ్గరుండీ మరీ పర్యవేక్షించారు నాట్స్ నాయకులు. లాస్ట్ మినిట్ ఛాలెంజ్లు అధిగమించడం, వివిధ కమిటీల సమన్వయం, అతిథులను రిసీవ్ చేసుకోవడం వంటి పనుల్లో నాట్స్ నాయకత్వం (NATS Leaders) నిన్నంతా బిజీ బిజీగా గడిపారు.

ఫ్లోరిడా (Florida) రాష్ట్రం, టాంపా నగరంలోని హిల్స్ బొరో నదీ (Hillsborough River) నడుఒంపుల్లో 36,000 చదరపు అడుగుల బాల్ రూమ్, 52 బ్రేకౌట్ రూమ్స్ తో మొత్తంగా 2,00,000 చదరపు అడుగులలో నెలకొన్న టాంపా కన్వెన్షన్ సెంటర్ (Tampa Convention Center) ని అందంగా ముస్తాబు చేశారు.

కన్వెన్షన్ సెంటర్ చుట్టూ రివర్ ఫ్రంట్ (River Front) ఉండడంతో సరదాగా బోట్ రైడ్ (Boat Ride) కి కూడా వెళ్లేలా, చూడడానికి రెండు కళ్ళు చాలవన్నట్టు ఉంది. దానికి తోడు వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉండడంతో సమ్మర్ టైంలో పర్ఫెక్ట్ కన్వెన్షన్ అంటున్నారు ఇప్పటికే విచ్చేసిన నాట్స్ సభ్యులు.

టాలీవుడ్ నుంచి బాలయ్య (Nandamuri Balakrishna), బన్నీ (Allu Arjun), వెంకటేష్ (Venkatesh Daggubati), తమన్, దేవిశ్రీ ప్రసాద్, శ్రీలీల (Sreeleela), గోపీచంద్ మలినేని, చంద్రబోస్, సాయి కుమార్, జయసుధ వంటి అగ్రతారాగణం తోపాటు కమెడియన్స్, టీవీ నటీనటులు, సాహితీవేత్తలు, రచయితలు ఇప్పటికే టాంపా కన్వెన్షన్ సెంటర్ (Tampa Convention Center) ని అనుకోని ఉన్న రెండు 7 స్టార్ మారియాట్ హోటల్స్ లో దిగారు.

అమెరికా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున తారాగణం, ముగ్గురు ఉద్దండుల లైవ్ కాన్సర్ట్స్ తో ప్రవాసులలో అంచనాలను పెంచేసిన ఈ నాట్స్ (North America Telugu Society) 8వ అమెరికా తెలుగు సంబరాలు (Convention) ప్రారంభం అవడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలివుంది.

నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ (Never Before Ever After) అనేలా ఏర్పాట్లు చేసిన నాట్స్ (North America Telugu Society) 8వ అమెరికా తెలుగు సంబరాలకు https://sambaralu.org/buynow ని సందర్శించి ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మరింత తాజా సమాచారం కోసం NRI2NRI.COM ని సందర్శిస్తూనే ఉండండి.

error: NRI2NRI.COM copyright content is protected