Connect with us

Convention

ఆంధ్ర వైభవాన్ని చాటేలా AAA Convention కి ఆల్ సెట్, ప్రోగ్రాం గైడ్ ఇదిగో @ Philadelphia

Published

on

Philadelphia, Pennsylvania: అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రవాసుల కోసం కల్చర్ ఎట్ కోర్ అంటూ ప్రత్యేకంగా ఏర్పడిన మొట్టమొదటి జాతీయ సంస్థ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (Andhra Pradesh American Association – AAA). మార్చి 28, 29 తేదీలలో మొట్టమొదటి జాతీయ కన్వెన్షన్ (Convention) కి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

పెన్సిల్వేనియా లోని ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్ పో సెంటర్ (The Greater Philadelphia Expo Center, Oaks) లో నిర్వహణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. AAA ఫౌండర్ హరి మోటుపల్లి (Hari Motupalli) ఆధ్వర్యంలో పురుడు పోసుకున్న పెన్సిల్వేనియా (Pennsylvania) రాష్ట్రం లోని ఫిలడెల్ఫియా (Philadelphia) నగరంలోనే మొదటి కన్వెన్షన్ నిర్వహించడం విశేషం.

మొదటిరోజు బాంక్వెట్ డిన్నర్ నైట్ (Banquet Dinner Night) కి సుప్రీమ్, ఎలైట్, ప్రీమియం అంటూ 3 రకాల సీటింగ్ ఏర్పాట్లు చేశారు. సెలెబ్రిటీలు (Celebrities) మరియు స్టార్స్ (Stars) అందరికీ అందుబాటులో ఉండేలా Convention సీటింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయం.

రెండు రోజుల పండుగ లాంటి AAA Convention కి సంబంధించి ప్రోగ్రాం గైడ్ (Program Guide) కూడా రిలీజ్ చేశారు. మొదటి రోజు నెట్వర్కింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు, అవార్డ్స్, ఫ్యాషన్ షో, దాతల సత్కరణ, నిరవల్ బ్యాండ్ సంగీత విభావరి (Musical Night) వంటి ప్రోగ్రామ్స్ లైనప్ అయి ఉన్నాయి.


రెండో రోజు ఉదయం శ్రీ శ్రీనివాస కళ్యాణం (Sri Srinivasa Kalyanam) మరియు ఉగాది పండుగని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం (Panchanga Sravanam) తో ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ఒక పక్క బిజినెస్ సెమినర్స్ (Business Seminars), మరో పక్క మెయిన్ స్టేజ్ పై కార్యక్రమాలు సాగుతాయి.

ఇక సాయంత్రం సెలెబ్రిటీల సత్కారం, స్టార్స్ ప్రసంగాలు, వివిధ పోటీల (Short Films, Reels, Muggulu) బహుమానాల అందజేత, కన్వెన్షన్ టీం రికగ్నిషన్, గ్రాండ్ ఫినాలే టాలీవుడ్ సంగీత బాద్షా తమన్ (SS Thaman) లైవ్ మ్యూజికల్ నైట్ (Concert) తో కన్వెన్షన్ ఘనంగా ముగియనుంది. పూర్తి కన్వెన్షన్ ప్రోగ్రాం గైడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇప్పటికే ఇండియా నుంచి హీరోలు, హీరోయిన్స్, రాజకీయ నాయకులు వంటి విశిష్ట అతిథులు ఫిలడెల్ఫియా (Philadelphia, Pennsylvania) నగరంలో ల్యాండ్ అయ్యారు. AAA ప్రెసిడెంట్ బాలాజీ వీర్నాల (Balaji Veernala) ఆధ్వర్యంలో Convention కమిటీల సభ్యులు హాస్పిటాలిటీ, భోజనాలు, హోటెల్, ట్రాన్స్పోర్టేషన్ వంటి పనులను చక్కబెడుతూ ఉత్సాహంగా ఉన్నారు.

Convention Banquet: https://nationalconvention1.theaaa.org/banquet-seats
Convention Day 2, Thaman Concert: https://nationalconvention1.theaaa.org/event-registration.html

Vendor Exhibits: https://nationalconvention1.theaaa.org/exhibits-seats
AAA Membership: https://www.theaaa.org/global/member-registration

error: NRI2NRI.COM copyright content is protected