Connect with us

Conference

రారండోయ్ ATA Convention చూద్దాం; సర్వం సిద్ధం, రేపే మొదలు @ Georgia World Congress Center, Atlanta

Published

on

రెండు మూడు రోజులుగా వార్ రూమ్, వార్ రూమ్ (War Room) అంటుంటే అర్థం కాలేదు. వెళ్లి చూస్తే, ఆటా నాయకులు కూర్చుని, రకరకాల కమిటీలతో, వెండర్లతో, వేరే టీంలతో మాట్లాడుతున్నారు, చర్చించుకుంటున్నారు, ఫోనుల్లో మాట్లాడుతున్నారు, వీడియో కాన్ఫరెన్స్ లు నడుస్తున్నాయి.

అప్పుడు అర్థం అయ్యిందేమంటే, జనతా గ్యారేజ్ సినిమాలో లాగా, ‘ఇచ్చట అన్ని రకముల సమస్యలకు పరిష్కారం చూపబడును’ అని. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఆటా (ATA) వారు ఏ లెవెల్లో రెడీ అవుతున్నారో. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్యులు శ్రీధర్ బాబు దుద్దిళ్ల, భద్రాద్రి పండితులు, సినిమా వారు మెహ్రీన్, తమన్, అనూప్ రూబెన్స్, అంకిత, రోహిత్, సత్య మాస్టర్ వంటి ఎందరో విచ్చేశారు.

మరి కొందరు బయలుదేరి, విహంగ వీక్షణ చేస్తున్నారు. వేరే ఊర్ల నుంచి ఆటా నాయకులు ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతిరెడ్డి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, పాస్ట్ ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, అజయ్, నర్సిరెడ్డి గడ్డికొప్పుల ఏతెంచారు, మిగతా వాళ్లు ఆన్ ది వే.

అలానే దూర ప్రాంతాల నుండి చాలామంది వచ్చి, హోటళ్ళలోనో, బంధువుల ఇళ్లలోనో ఉంటున్నారు. కాన్సులేట్ జనరల్ అఫ్ ఇండియా, అట్లాంటా మేయర్ (Atlanta Mayor), కాంగ్రెస్ మెన్, సెనేటర్స్, ఇక్కడి దేశీయ నాయకులు ఇలా చాలా మంది వేంచేయబోతున్నారు. వేరే వేరే నాన్ ప్రాఫిట్, ప్రాఫిట్ సంస్థలు మరియూ మీడియా సంస్థల నుంచి చాలా మంది ప్రతినిధులు వస్తున్నారు.

మీకు తెలుసుగా ఇదంతా ఎందుకోసమో, 18 వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ (ATA Convention & Youth Conference) అట్లాంటా (Atlanta) లో ఈ శుక్రవారం, జూన్ 7 నుండి 9 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతోందని. శుక్రవారం సాయంత్రం బాంక్వెట్ లో వివిధ రంగాలలో నిష్ణాతులకు ఆటా సాఫల్య అవార్డులు ప్రధానం చేస్తారు.

ఇక శని, ఆదివారాలలో ఝుమ్మంది నాదం అంటూ పాటల పోటీలు, సయ్యంది పాదం డ్యాన్స్ పోటీలు, ఆత్మ విశ్వాసం కోసం పెజంట్, ధ్యానం గురు దాజి ఉపన్యాసం, భద్రాద్రి కళ్యాణం, షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ పోటీలు, దడదడలాడించే అనూప్ రూబెన్స్, థమన్, త్రీఓరీ మ్యూజికల్ కాన్సర్ట్లు, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్, ఉమెన్స్ ఫోరమ్, అమెరికా మరియూ భారత దేశాల పొలిటికల్ ఫోరంలు, ఆలంనై మీటింగులు, బిజినెస్ ఫోరంలు (Business Forums), సాహిత్య విభావరి, అష్టావధానం, లైఫ్ టైం అవార్డులు, ఆత్మీయ సత్కారాలు, వెండర్ స్టాల్ల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.

యువత గురించి సరే సరి, వారికి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఉండనే ఉన్నాయి. అసలు విషయం మర్చిపోకూడదు, మంచి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆటా వారు. మరి ఇన్ని వినోదాలు, విశేషాలు ఒకే చోట ఉంటే, ఆలస్యం ఎందుకూ, టిక్కెట్ల గడువు కూడా ముగుస్తోంది, త్వరపడండి, వివిధ కాన్ఫరెన్స్ వివరాల కోసం https://ataconference.org/ ని, టిక్కెట్లకు https://ataconference.org/Registration/Attendee-Registration ని సందర్శించండి.

ఆటా కమ్యూనిటీ రీచ్ సందర్భంగా అట్లాంటా (Atlanta) తో పాటు వేర్వేరు నగరాలలో సమావేశాలు నిర్వహించారు, ఎంతోమంది రావడానికి ఉత్సాహం చూపించారు. అలానే, టాలీవుడ్ (Tollywood) తారలతో కమ్యూనిటీ వాక్ కు 300 మందికి పైగా విచ్చేయడం హర్షణీయం. విశిష్ట అతిథులతో ఆత్మీయ సమ్మేళనాలు ఇప్పటికే మొదలయ్యాయి.

కన్వెన్షన్ కోర్ టీం అధ్యక్షురాలు మధు బొమ్మకంటి, కన్వీనర్ కిరణ్ పాశం, కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ ఆధ్వర్యంలో దాదాపు 70 కమిటీలలో 500 మందికి పైగా వాలంటీర్లు అవిశ్రాంత కృషికి తగ్గ అజరామర ఫలితాలు త్వరలో చూడబోతున్నాము.

కన్వీనర్ కిరణ్ పాశం (Kiran Pasham) మాట్లాడుతూ… ఇప్పటికే చాలా పనులు పూర్తి అయ్యాయనీ, కొన్ని నడుస్తున్నాయనీ, ప్రపంచమంతా ఈ వేడుకల కోసం ఎదురు చూస్తోందనీ, ముఖ్యంగా యువత ఆటాకి ఎంతో ముఖ్యమనీ, వారికి చాలా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయని చెప్తూ, అందరినీ సాదరంగా ఆహ్వానించారు.

అధ్యక్షురాలు మధు బొమ్మినేని (Madhu Bommineni) జార్జియా గవర్నర్ (Georgia Governor) సందేశం అందరికీ వినిపించి, జరగబోయే స్పిరిట్యుయల్, కంటిన్యూయస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యత వివరిస్తూ, ఎంతో మంది అహర్నిశలూ కష్టపడుతున్నారని, చాలా ఉపయుక్త కార్యక్రమాలు ఉన్నాయనీ, వెండర్ స్టాల్ల్స్, ఎన్నో ఫోరమ్స్ గురించి వివరించి, అందరికీ ఆహ్వానం పలికారు.

పుర ప్రజలందరూ ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్న ఈ 18 వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ (ATA Convention & Youth Conference) మహా పండుగకు రారండోయ్ వేడుక చూద్దాం, కలిసి తిరుగుదాం, తిందాం, అన్ని కార్యక్రమాలలో పాలు పంచుకుని, విజ్ఞాన, వినోదాలలో తేలియాడుదాం.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected