రాష్ట్రంలో విద్యారంగ పరిరక్షణ కోసం, అవినీతిరహిత తెలంగాణ నవ నిర్మాణానికి కదం కదం కలిపి కదనభేరీని మోగిద్దామని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) తెలంగాణ పిలుపునిచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ‘తెలంగాణ కదనభేరి’ విజయవంతంగా జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వ వంద వైఫల్యాలపై ఛార్జిషీట్ విడుదల చేసారు. లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ప్రభుత్వం అరకొర ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నదని, ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా ఇచ్చిన వాగ్దానం వమ్ము అయ్యిందని తెలిపింది.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలతో లక్షలాదిమంది నిరుద్యోగుల జీవితాలను ఆడుకుంటున్నదని ఆరోపించింది. లీకేజీలు, ప్యాకేజీలతో కేసీఆర్ కుటుంబం రాజభోగాలు అనుభవిస్తున్నదని, మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడుదామని ఏబీవీపీ తెలిపింది
కేసీఆర్ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా ఏబీవీపీ పని చేస్తుందని, విద్యార్థుల సమస్యలపై పోరాటం మరింత ఉద్ధృతం చేస్తామని ఏబీవీపీ జాతీయ, రాష్ట్ర నాయకులు స్పష్టం చేశారు. ఏబీవీపీ ఆర్గనైజేషనల్ జాతీయ సెక్రటరీ ఆశీష్ చౌహాన్, జాతీయ జాయింట్ సెక్రటరీ బాలకృష్ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి యాజ్ఞవల్క్య శుక్లా సహా పలువురు ప్రముఖులు ఈ సభకు హాజరయ్యారు.
బీజేపీ నేతలు మురళిధర్ రావు, మనోహర్ రెడ్డి, ఈటల రాజేందర్ సహా పలువులు ఈ సభకు హాజరయ్యారు. పదేళ్లలో తెలంగాణ సర్కారు విద్యారంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని, సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చొని కుటుంబ ప్రగతిని మాత్రమే సాధించారని ఏబీవీపీ ఆర్గనైజేషనల్ జాతీయ సెక్రటరీ ఆశీష్ చౌహాన్ ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస టాయిలెట్లు లేని దుస్థితి ఉందని, అధ్యాపకుల నియామకం ఎందుకు చేపట్టట్లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 20 వేల టీచర్ల పోస్టుల భర్తీ వెంటనే చేపట్టాలని ఏబీవీపి రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ డిమాండ్ చేసింది. విద్యార్థుల సమస్యలకు అద్దం పట్టేలా పెద్దఎత్తున తరలివచ్చిన విద్యార్థులే అందుకు నిదర్శనం అన్నారు.
ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నయని.. తెలంగాణలో మాత్రం అవినీతి రాజ్యం ఏలుతుందని అన్నారు. తెలంగాణ విద్యార్థి లోకం కెసిఆర్ గారికి తగిన గుణపాఠం చెబుతుందని అన్నారు. అదేవిధముగా ప్రవాస భారతీయులు అమెరికా నుండి పూర్వ విద్యార్థులు ఏబీవీపీ కదనబేరి కి పూర్తి సంఘీభావం తెలిపారు.
అందులో భాగముగా విలాస్ రెడ్డి జంబుల, శ్రీకాంత్ తుమ్మల, శ్రీనివాస్ కొంపల్లి, సంతోష్ రెడ్డి, బుచ్చన్న గాజుల, నరేందర్ గౌడ్ దోసపాటి, బాలవర్ధన్, ఆదిత్య రాయుడు, భరత్ గోలి, రామకృష్ణ, రఘువీర్, రామ్ వేముల, ప్రదీప్ కట్ట పూర్తి మద్దతు తెలిపారు. నిజంగానే మహోద్యమం. 50 వేల మందికి పైగానే వచ్చారు. మరో ముప్పై వేలమంది సభకు అటూఇటూగా గ్రౌండ్ కి వచ్చారు.
ఇటీవలికాలంలో విద్యార్థిపరిషత్ తీసుకున్న అద్భుత కార్యక్రమం. వాతావరణం ఎలా ఉంటుందో వర్షంతో ఎక్కడ ఆటంకం ఏర్పడుతుందోనని రాజకీయపార్టీలు సైతం బహిరంగ సభల్ని వాయిదా వేసుకున్న పరిస్థితి. విద్యార్థి ఉద్యమాలతో అలుపెరగని పోరాటం చేస్తున్న విద్యార్థి పరిషత్ సంకల్పానికి వరణుడు, ప్రకృతి సైతం సహకరించాయి. ఒక్కొక్కరు ఎంత అద్భుతంగా మాట్లాడారు. విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వానికి గట్టి హెచ్చరికే పంపారు.
ఏబీవీపీ పోరాటంతో నాడు ఎన్నడో గుజరాత్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిందంటే ఇంతవరకు మళ్లీ అక్కడ ఆ పార్టీ గద్దె నెక్క లేదు. అలాంటి ఉద్యమమే తెలంగాణలో చేస్తామని, ఏ పార్టీకో మేం బీటీం కాదని, బీజేపీకి అసలే కాదని, విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వాలు ఏవైనా పోరాటాలు చేస్తామని, కర్నాటకలో బీజేపీ ప్రభుత్వ తీరుపైనా ఆందోళన చేసిన నేపథ్యాన్నీ విద్యార్థిపరిషత్ గుర్తు చేస్తోంది.