Connect with us

Service Activities

Harrisburg, Pennsylvania: 100+ విద్యార్థులు, తానా వాలంటీర్లతో ‘Adopt-A-Highway’ శుభ్రత కార్యక్రమం విజయవంతం

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), మిడ్-అట్లాంటిక్ బృందం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6, 2025న హారిస్బర్గ్లోని (Harrisburg, Pennsylvania) సిల్వర్ స్ప్రింగ్ టౌన్షిప్లో ‘Adopt-A-Highway’ వాలంటీర్ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కోడాలి (Naren Kodali), తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి (Ravi Potluri), తానా బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, మిడ్-అట్లాంటిక్ రీజినల్ ప్రతినిధి ఫణి కంతేటి, కమ్యూనిటీ నాయకులు సతీష్ తుమ్మల (Satish Tummala), సునీల్ కోగంటి మరియు సతీష్ చుండ్రు పర్యవేక్షించారు.

వీరందరూ వచ్చిన వారిని ఉద్దేశించి స్ఫూర్తిదాయక మాటలతో వారిని ఉత్సాహపరిచారు. వందకు పైగా మధ్య, ఉన్నత పాఠశాల విద్యార్థులు తానా వాలంటీర్లతో (TANA Volunteers) కలిసి ఈ క్లీనప్ లో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, సమాజం పట్ల బాధ్యతను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తానా మిడ్-అట్లాంటిక్ (TANA Mid-Atlantic Chapter) నిర్వహణ బృందం సభ్యులు రాజు గుండాల, వెంకట్ ముప్పా, శ్రీను కోట, శ్రీనివాస్ అబ్బూరి, నవీన్ తోకాల, వేణు మక్కెన, కిషోర్ కొంక, రాకేష్ పైడి తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎంతో కృషి చేశార. ఇందులో పాల్గొన్నవారికి రుచికరమైన అల్పాహారాన్ని అందజేశారు.

వాలంటీర్ల కృషిని గుర్తిస్తూ వెంకట్ సింగు (Venkat Singu), ఫణి కంతేటి (Phani Kantheti) విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమాన్ని విజయంతంగా నిర్వహించడం పట్ల తానా బోర్డు సభ్యుడు రవి పొట్లూరి సంతోషం వ్యక్తం చేస్తూ, ఇందులో పాల్గొన్న వారందరినీ అభినందించారు.

ఈ కార్యక్రమం ద్వారా సామాజిక సేవ, యువత భాగస్వామ్యం, మరియు పౌర గౌరవాన్ని పెంపొందించడంలో తానా (Telugu Association of North America – TANA) కు ఉన్న చిత్తశుద్ధిని ఇది చాటిందని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన వారందరికీ మిడ్ అట్లాంటిక్ తానా (TANA Mid-Atlantic Chapter) నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.

error: NRI2NRI.COM copyright content is protected