Connect with us

Dance

అట్లాంటా ఆడపడుచు ఆరుషి అరంగేట్రం @ Hyderabad, మాజీ ఉపరాష్ట్రపతి & మాజీ సీజే హాజరు

Published

on

జార్జియా రాష్ట్రం, అట్లాంటా ఆడపడుచు ఆరుషి నాగభైరవ తన కూచిపూడి అరంగేట్రంతో ముఖ్య అతిథులు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ మరియు ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ (Chandrabose) ల అభినందనలు అందుకుంది. అందరికంటే విభిన్నంగా అమెరికాలో కూచిపూడి నృత్యం నేర్చుకొని ఇండియాలో (Hyderabad) అరంగేట్రం చేయడం విశేషం.

అట్లాంటా (Atlanta) వాసులు శ్రీనాధ్ నాగభైరవ మరియు మాలతి నాగభైరవ ల కుమార్తె ఆరుషి నాగభైరవ స్థానిక నటరాజ నాట్యాంజలి (Nataraja Natyanjali) ప్రముఖ గురువర్యులు నీలిమ గడ్డమణుగు వద్ద కూచిపూడి అక్షరాభ్యాసం చేసి, దాదాపు 13 సంవత్సరాల పట్టువదలని కఠోరశ్రమతో నాటుదేలి చివరికి గత నెల జులై 7, ఆదివారం రోజున హైదరాబాద్ (Hyderabad) లో అరంగేట్రం చేసి తన ప్రతిభను నిరూపించుకుంది.

మాదాపూర్ లోని శిల్పకళా వేదిక (Shilpakala Vedika) ఈ నృత్య కార్యక్రమానికి వేదికయ్యింది. ముందుగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Muppavarapu Venkaiah Naidu) మరియు మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ (Nuthalapati Venkata Ramana) జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విఘ్నేశ్వరుని ప్రార్ధనతో ఆరుషి కూచిపూడి నృత్య ప్రదర్శన మొదలయ్యింది.

లింగాష్టకం, భామా కలాపం, తారంగం, అన్నమాచార్య కీర్తన, తిల్లాన, గోవింద నామాలను సంగీత సప్తస్వరాలకనుగుణంగా కూచిపూడి (Kuchipudi) నృత్య రూపకంలో ప్రదర్శించిన తీరు అమోఘం. నృత్య భంగిమలు, భావ వ్యక్తీకరణ, ఆహార్యంతో ఆరుషి (Aarushi Nagabhirava) ఆహ్వానితులందరినీ ఆకట్టుకుంది.

ఆరుషి నృత్య ప్రదర్శనని ఆసాంతం తిలకించిన ముప్పవరపు వెంకయ్య నాయుడు, ఎన్వి రమణ మరియు ఇతర ప్రముఖులు ఆరుషి ని ప్రత్యేకంగా అభినందించారు. అమెరికాలో చదువుకుంటూ కూడా భారతీయ సంస్కృతిని, నాట్యశాస్త్రాన్ని సాధన చేస్తున్న ఆరుషి తెలుగు యువతరానికి స్ఫూర్తి అంటూ వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) కొనియాడారు.

వివిధ స్వాముల భక్తి నేపథ్యంలో ఏర్పాటు చేసిన వేదిక బహు చక్కగా ఉంది. ఆరుషి నాగభైరవ కుటుంబం తోపాటు, బంధువులు, శ్రేయోభిలాషులు, ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజా (Alapati Raja), తెలంగాణ రాష్ట్ర (Telangana) పరిగి ఎమ్మెల్యే & TRR గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ డా. T రామ్మోహన్ రెడ్డి, ఆ సమయంలో ఇండియాలో ఉన్న ఇతర అట్లాంటా స్నేహితులు, నాట్య గురువులు నీలిమ గడ్డమణుగు (Neelima Gaddamanugu) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నృత్య కార్యక్రమం అనంతరం పెద్దలను పుష్పగుచ్చం, శాలువాతో ఘనంగా సత్కరించారు. అలాగే ఆరుషి పెద్దల ఆశీర్వాదం అందుకుంది. చివరిగా ఆరుషి తల్లితండ్రులు మాలతి నాగభైరవ (Malathi Nagabhirava) మరియు శ్రీనాధ్ (Srinadh Nagabhirava) నాగభైరవ అందరికీ కృతఙ్ఞతలు తెలియజేస్తూ వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected