ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటి నేషనల్ కన్వెన్షన్ (Convention) 2025 మార్చి 28, 29 తేదీలలో పెన్సిల్వేనియా (Pennsylvania) లోని ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్ పో సెంటర్ (The Greater Philadelphia Expo Center, Oaks) లో పెద్ద ఎత్తున నిర్వహించనున్న విషయం అందరికీ తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ సంప్రదాయాలు, సంస్కృతులు ప్రపంచ వ్యాప్తంగా పరిఢవిల్లేలా, అమెరికాలోని తెలుగు కమ్యూనిటీని ఏకం చేస్తూ ప్రణాళికా బద్దంగా ఏర్పాట్లు చేస్తున్న AAA (Andhrapradesh American Association) 1st కన్వెన్షన్ కి సంబంధించి ఇప్పటికే పలు వివరాలు తెలియజేశారు.
ఇందులో భాగంగా ఇప్పుడు వెండర్ ఎగ్సిబిట్స్ (Vendor Exhibits) రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. వ్యాపారం, సేవలు, ప్రోడక్ట్ ప్రమోషన్, లాభాపేక్షలేని సంస్థలు, సర్వీసెస్, బ్రాండ్ ప్రమోషన్ ఇలా ఎవరైనా వేలమంది తెలుగువారికి త్వరితగతిన చేరువవ్వాలంటే తక్షణమే రిజిస్టర్ చేసుకోండి.
15 వేలమంది తెలుగువారికి మీ వ్యాపార సేవలు అందేలా ఈ వెండర్ ఎగ్సిబిట్స్ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. మెయిన్ కన్వెన్షన్ (Convention) స్టేజ్ ఈవెంట్ కి వెళ్లాలన్నా, భోజనానికి వెళ్లాలన్నా, విరామ సమయంలో సేదతీరేలా అటు ఇటు తిరగాలన్నా అందరూ వెండర్ ఎగ్సిబిట్స్ ప్రాంతం మీదుగా మాత్రమే వెళ్లేలా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చక్కగా ప్లాన్ చేశారు.
ఈ మధ్యనే నిర్వహించిన అరిజోనా చాప్టర్ (AAA Arizona Chapter) సంక్రాంతి సంబరాలలో ఇదే మోడల్ ని ఫాలో అవ్వడం, అది విపరీతంగా విజయవంతమయ్యి ఒక లోకల్ ఈవెంట్ కే దాదాపు 10 వేల మంది అక్కడి వెండర్ ఎగ్సిబిట్స్ ని సందర్శించడంతో, ఇప్పుడు అదే ఫార్ములాని కన్వెన్షన్ (AAA 1st National Convention) లో కూడా తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు.
అదనంగా వెండర్ ఎగ్సిబిట్స్ (Vendor Exhibits) ని సెలెబ్రిటీలు సందర్శించేలా మరియు ఫోటోలు దిగేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో కస్టమర్ల ఫుట్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎక్స్ప్లోర్, కనెక్ట్ అండ్ షాప్ అంటూ ఉయ్ గాట్ ఇట్ ఆల్ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) నాయకులు.
ఆన్లైన్ లో వెండర్ ఎగ్సిబిట్స్ లేఅవుట్ (Vendor Exhibits Layout) చూసుకొని ఎవరికి ఇష్టం వచ్చినచోట వారే ముందే సెలెక్ట్ చేసుకుని బుకింగ్ చేసుకునేలా ఏర్పాటు చేయడం ప్రత్యేకత. ఇప్పటికే కొన్ని అయిపోయాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈ క్రింది లింకుల ద్వారా త్వరగా మీ రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకోండి.
Vendor Exhibits: https://nationalconvention1.theaaa.org/exhibits-seats
Convention Banquet: https://nationalconvention1.theaaa.org/banquet-seats
Convention Day 2: https://nationalconvention1.theaaa.org/event-registration.html
AAA Membership: https://www.theaaa.org/global/member-registration