Connect with us

Music

Y7Arts @ Singapore: మనోహరమైన తెలుగు ప్రేమగీతం ‘రామసక్కనోడా’ విడుదల

Published

on

Singapore: ఇటీవల Y7ARTS చానెల్, తెలుగు ప్రతిభను ప్రపంచానికి చాటుతూ మరో అద్భుతమైన సంగీత ప్రాజెక్ట్‌ను అందించింది. హృదయాన్ని హత్తుకునే తెలుగు ప్రేమగీతం రామసక్కనోడా విడుదలై, సింగపూర్ (Singapore) స్థానిక కళాకారులతో రూపొందిన ఈ గీతం సంప్రదాయ వస్త్రధారణ, ఆధునిక కథనాన్ని అనుసంధానిస్తూ విశేష ఆదరణ పొందుతోంది.

రామసక్కనోడా గీతానికి ప్రాణం పోసినది శిష్ట్లా శ్రీతిక (Sishtla Sreethika). ఆమె అద్భుతమైన చిరునవ్వు, సహజమైన నటనతో ప్రేక్షకులను ముగ్ధుల్ని చేసింది. ఆమె అందించిన విశేష ప్రదర్శన ఈ పాటను మరింత ప్రత్యేకంగా మార్చింది. శ్రీయ (Shriya) మరియు నిఖిత (Nikhitha) కూడా అద్భుతంగా సహకరించి, ఈ గీతాన్ని మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దారు.

దర్శకుడు రజినీకాంత్ (Rajinikanth) మరోసారి తన అద్భుతమైన ప్రతిభను రామసక్కనోడా ద్వారా ప్రదర్శించారు. ఇప్పటికే ఎనిమిది షార్ట్ ఫిల్మ్స్, మరో రెండు పాటలను సింగపూర్‌ (Singapore) లో తెరకెక్కించిన ఆయన, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ, నూతన సృజనాత్మకతను స్వీకరించడంలో ముందుంటారు. ఆయన పని, సింగపూర్‌లోని తెలుగు ప్రతిభను ప్రపంచానికి చాటుతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు (Director) చిత్ర బృందానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి కష్టపడి పని చేసిన నటీనటులు, సాంకేతిక బృందం ఎడిటింగ్, DOP సాయితేజ కుందరపు (Sai Teja Kundarapu), కొరియోగ్రాఫర్ రమేష్ పిట్ట (Ramesh Pitta) మరియు సహా నిర్మాత శ్రీనివాస్ పుల్లం (Srinivas Pullam) గారిని అభినందించారు.

అలాగే, తమ పిల్లలను ప్రోత్సహిస్తూ, కళారంగంలో అభివృద్ధి చెందడానికి సహాయపడిన తల్లిదండ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వారి మద్దతు లేకుండా ఇలాంటి ప్రతిభ గల కళాకారులు ఎదగడం కష్టమని, వారి సహకారం ఎంతో విలువైనదని అన్నారు. సంప్రదాయం మరియు ఆధునికతను సమపాళ్లలో మిళితం చేస్తూ, ఈ చానెల్ సంగీత, సినిమా రంగాల్లో శాశ్వత ప్రభావం చూపేలా ముందుకు సాగుతోంది.

error: NRI2NRI.COM copyright content is protected