అట్లాంటా తెలుగు సంఘం (Telugu Association of Metro Atlanta) ‘తామా’ వారు నవంబర్ 12 శనివారం రోజున దివ్య దీపావళి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆల్ఫారెటా లోని ఫేజ్ ఈవెంట్స్ హాల్ ఈ వేడుకలకు వేదిక కానుంది. ఈ దివ్య దీపావళి వేడుకలలో ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ లైవ్ మ్యూజికల్ నైట్ హైలైట్ అవ్వనుంది.
యువతను బాగా ఆకట్టుకుంటున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ తెలుగు సినీ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ తన ట్రూప్ తో అందరినీ ఎంటర్టైన్ చేయడానికి అట్లాంటా వస్తున్నారు. ఈ ట్రూప్ లో అనూప్ రూబెన్స్ తోపాటు గాయనీగాయకులు రఘు కుంచె, ధనుంజయ్, లిప్సిక, సాహితి, రోహిత్, రాపర్ రోల్ రీడా తదితరులు ఉన్నారు.
తామా మాట అట్లాంటా చిన్నారుల నోట అంటూ బాలల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, షాపింగ్ స్టాల్స్, ర్యాఫుల్ బహుమతులు, చక్కని పండుగ విందు భోజనం వంటివి మరెన్నో హైలైట్స్ ఉన్నాయి. సరదా యాంకరింగ్ తో అలరించే యాంకర్ సమీరా (Sameera) కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు.
టికెట్స్ కొరకు www.NRI2NRI.com/TAMADivyaDeepavali ని సందర్శించండి. ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ రేట్లు నవంబర్ 6 వరకు మాత్రమే. కావున త్వరగా టికెట్స్ కొనుక్కోవలసిందిగా తామా కార్యవర్గ సభ్యులు కోరుతున్నారు. స్టాల్ల్స్ రెజిస్ట్రేషన్ కొరకు పై లింక్ లేదా ఫ్లయర్ లో ఉన్న వారిని సంప్రదించండి.