టీడీఎఫ్ అట్లాంటా చాప్టర్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1వ తేదీన నిర్వహించిన బతుకమ్మ మరియు దసరా ఉత్సవం అంగరంగ వైభవం గా జరిగింది. అట్లంటా తెలుగువారు తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మను నాలుగువేల భారీ జనసoదోహం మధ్యన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుపుకున్నారు.
స్థానిక కళాకారులు ప్రదర్శించిన రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ Telangana Development Forum (TDF) వేడుక మొదలవగా, తెలుగింటి ఆడుపడుచులు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను ప్రదర్శించి, ఆహుతులను అలరించి అబ్బురపరిచారు.
పిల్లలూ పెద్దలూ కలిసి వందకు పైగా కళాకారులు తమ నైపుణ్యాలని ప్రదర్శించగా అరవై ఐదుకు పైగా బతుకమ్మల మధ్య ఆరు గంటలపాటు సాగిన ఈ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ అట్లాంటా చాప్టర్ వేడుక బతుకమ్మల నిమజ్జనంతో ముగిసింది.
ఆకట్టుకునే విధంగా బతుకమ్మలను (Bathukamma) అలంకరించిన వనితామణులు రెండు వేల డాలర్ల వరకు క్యాష్ ప్రైజులు, డైమండ్ రింగ్, సిల్వర్ కాయిన్లు, సిల్వర్ బౌల్ సెట్లు, వెరా బ్రాడ్లీ పర్సులు వంటి ఆకట్టుకునే ప్రైజులు గెల్చుకుకున్నారు.
ఆహుతుల కోసం Biryani Pot & Srikrishna Villas వారి సహకారంతో కాంప్లిమెంటరీ సాంప్రదాయ భోజనం ఏర్పాటు చేశారు మరియు వివిధ రకాల వెండర్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. టీడీఎఫ్ కోర్ టీమ్ సమిష్టి కృషితో ఘనమైన బతుకమ్మ పండుగను నిర్వహించి విజయవంతం చేయటం గర్వంగా ఉందని టీడీఎఫ్ అట్లాంటా చాప్టర్ అధ్యక్షురాలు స్వప్న కస్వా కృషిని కొనియాడారు.
అలాగే ఈ కార్యక్రామానికి సహకరిoచిన వనితామణులందరికీ, కార్యక్రమ విజయవంతానికి కృషిచేసిన వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. ఫోర్ ఓక్స్ ఇన్సూరెన్స్, పీచ్ క్లీనిక్, ర్యాపిడ్ ఐటీ, ఈఐయెస్ టెక్నాలజీస్, ఎవరెస్ట్ టెక్నాలజీస్ మొదలగు దాతలు స్పాన్సర్ చేయగా, టీడీఎఫ్ కోర్ టీమ్, అట్లాంటా చాప్టర్ కమిటీ, మరెందరో వాలంటీర్లు కలిసి ఈ కర్యక్రమాన్ని ఆద్యంతం రక్తి కట్టించారు.