వర్జీనియాలో మే 27న నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మరియు యునైటెడ్ నేషనల్ డైవర్సిటి కోయిలేషన్ ఆఫ్ అమెరికా సంయుక్తంగా నిర్వహించిన మాతృదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నాటా మహిళా ఫోరమ్ చైర్మన్ సుధారాణి కొండపు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాటా ఆదర్శ మాతృమూర్తి గౌరవ పురస్కారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ అవార్డులు అందుకున్నవారిలో కళారంగం నుండి సాయికాంతలక్ష్మి రాపర్ల, విద్యారంగం నుండి జ్యోతిదేవి కోటి, ఆరోగ్యరంగం నుండి మిస్సెస్ అన్నే, చిన్నారులలో సాంస్కృతిక సంప్రదాయ అవగాహన పెంపొందించడంలో కృషి చేస్తున్న సూర్యకుమారి జి ఉన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో శ్రీమతి సుధా కృష్ణమూర్తి ప్రదర్శించిన భరత నాట్యం అందరిని ఆకట్టుకుంది. పిల్లల భవిష్యత్తు, ఆరోగ్యం, సంరక్షణ తదితర అంశాలపై నిపుణుల సూచనలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా చిన్నారులందరు తమ మాతృమూర్తులను సత్కరించడం విశేషం.
సోమిరెడ్డి లా ఫర్మ్ & యు.ఎస్. లా వారి సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమానికి నాటా బోర్డు సభ్యులు మోహన్ కాలడి, బాబురావు సామల, ప్రాంతీయ సమన్వయకర్తలు సతీష్ నారద, మధు మూతటి, డి.సి. జట్టు సభ్యులు సురేష్ కోతిన్తి, శశాంక్ రెడ్డి శరత్ రాయులే, సంధ్య బైరెడ్డి మరియు యునైటెడ్ నేషనల్ డైవర్సిటి కోయిలేషన్ ఆఫ్ అమెరికా సభ్యులు పాల్గొన్నారు. కంట్రీ ఓవెన్, బిర్యానీ పాయింట్, హైదరాబాద్ బిర్యానీ కార్నర్, తత్వ, రోటి ఎక్ష్ప్రెస్స్, అల్పాహారం మరియు తేనీటి విందు ఏర్పాటు చేసారు. చివరిగా వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.