అమ్మ – రెండక్షరాల మాట. చిన్నప్పుడు బోసినవ్వులతో మొదటిగా మన నోట వచ్చే మాట అమ్మ. పెరిగి పెద్దయి చిన్న దెబ్బ తగిలినా పలికే పలుకు అమ్మ. ఇలా ఎన్నో సందర్భాలలో నోటి మాటలోనే కాకుండా మన గుండెల నిండా గంభీరంగా ఉండేది ఉంటుంది ఉండబోయేది అమ్మే. మరి అలాంటి అమ్మల దినోత్సవాన్ని సెలెబ్రేట్ చేస్తున్నారు మన ఉత్తర అమెరికా తెలుగు సమితి వారు మరియు యునైటెడ్ నేషనల్ డైవర్సిటి కోయిలేషన్ ఆఫ్ అమెరికా వారు. మదర్స్ డే తో బాటు యూత్ వెల్నెస్ ఈవెంట్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఆదివారం మే 27న 4 గంటల నుండి వర్జీనియాలోని శాంత్ నిరంకారి మిషన్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం. ఈ కార్యక్రమానికి ఎన్నారై2ఎన్నారై.కామ్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తుంది. మరిన్ని వివరాలకు నాటా మహిళా ఫోరమ్ చైర్మన్ సుధా రాణి కొండపు (703-855-0063) ని సంప్రదించండి.