కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణం అనంతరం పునఃదర్శనలో భాగంగా చతుర్వేద హవన సహిత మహా కుంభాభిషేకం నాలుగవ రోజుకి చేరింది. ఆగష్టు 18 గురువారం రోజున ఎప్పటిలానే అర్చకులు, వేద పండితుల నడుమ వివిధ పూజలు నిర్వహించారు.
గ్రామ దేవత పూజ, గణపతి హోమం, లక్ష్మీ హోమం, నవగ్రహ హోమం, గోపూజ, స్వర్ణ కలశ ప్రతిష్ట, మొదలగును పూజలను నిర్వహించడం జరిగింది. సాయంత్రం చతుర్వేద పారాయణం, చతుర్వేద హవనం, యాగశాలకి పుట్ట మన్ను తీసుకురావడం జరిగింది. అలాగే మృత్యంగ్రహణం, అంకురార్పణ మొదలుగు పూజలు నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమాలలో ఆలయ పునర్నిర్మాణ దాతలు రవి ఐకా గారు, శ్రీనివాస్ గుత్తికొండ గారు, మరియు వారి కుటుంబ సభ్యులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, దేవస్థానం చైర్మన్ శ్రీ మోహన్ రెడ్డి గారు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ సురేష్ బాబు గారు, ఆలయ ఏ ఈ ఓ లు, పర్యవేక్షకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.