ఏప్రిల్ 29న న్యూజెర్సీలో తానా, క్యూరీ సంస్థలు సంయుక్తంగా వివిధ పోటీలు విజయవంతంగా నిర్వహించాయి. 2 నుండి 7వ తరగతి విద్యార్థుల వరకు గణితం, సైన్స్ మరియు స్పెల్ మాస్టర్ విభాగాలలో తరగతుల వారీగా నిర్వహించిన ఈ పోటీలకు అనూహ్య స్పందన వచ్చింది. సుమారు 150 మందికి పైగా పాల్గొన్న ఈ పోటీలను తానా న్యూజెర్సీ న్యూయార్క్ ప్రాంత నాయకులు విద్యాధర్ గారపాటి, లక్ష్మి దేవినేని, రాజా కసకుర్తి, శ్రీనాథ్ కోనంకి, శ్రీనివాస్ ఓరుగంటి, సుధీర్ నరేపాళెపు, వంశి వాసిరెడ్డి, రాధిక అంకెం, రత్న మూల్పూరి తదితరులు దగ్గిరుండి పర్యవేక్షించారు. స్థానిక తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం ఈ కార్యక్రమానికి న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ బోర్డ్ కమీషనర్ ఉపేంద్ర చివుకుల ముఖ్య అతిధిగా విచ్చేసారు. గెలిచిన విద్యార్ధులకి అభినందన పత్రాలు అందజేశారు. అలాగే మొదటి రెండు స్థానాలలో ఉన్నవారు మే 26, 27 తేదీలలో వర్జీనియాలో జరగబోయే జాతీయ పోటీలలో పాల్గొనవచ్చు.