అట్లాంటా తెలుగు సంఘం తామా వారు గత అయిదు సంవత్సరములుగా సిలికానాంధ్ర తెలుగు మాట్లాట పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతీయ పోటీలలో మీ పిల్లల్ని నమోదు చేయించి తెలుగు భాషని పెపొందించేందుకు కృషి చేయవలసిందిగా తామా కార్యవర్గ విన్నపం. ఏప్రిల్ 28న ఐడ్రిల్ వారి సహకారంతో నిర్వహించే తెలుగు మాట్లాట పోటీలలో మీ పిల్లల్ని నమోదు చేయించి పోటీలను విజయవంతం చేయాల్సిందిగా మనవి చేస్తున్నారు. నమోదు వివరాలకు మరియు అభ్యాసం కొరకు www.tama.org/manabadi ని సంప్రదించండి. మనబడి విద్యార్థులే కాకుండా మరెవ్వరైనా పాల్గొనవచ్చు. పిల్లలకి పెద్దలకి భోజనం సమకూర్చబడును.
పోటీలు నిర్వహించు స్థలము : దేశాన మాధ్యమిక పాఠశాల, 625 జేమ్స్ రోడ్, ఆల్ఫారెట్టా, జార్జియా.
సమయము : ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు.