Connect with us

Associations

వీనుల విందుగా దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం ఉగాది, శ్రీరామ నవమి ఉత్సవాలు

Published

on

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఏప్రిల్ 14న దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం ఉగాది, శ్రీరామ నవమి ఉత్సవాలు వీనుల విందు చేసాయి. లాస్ ఏంజెల్స్ లోని వాలి ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ ఉత్సవాలకు కనీ వినీ ఎరుగని రీతిలో 2000 మందికి పైగా తెలుగు వారు పాల్గొనున్నారు. ఇండియాలో మన సొంత ఊరిలో పండుగ చేసుకుంటున్నామా అన్నట్టు ఏర్పాటు చేసిన రంగు రంగుల అలంకరణలు గ్రామీణ వాతావరణాన్ని తలపించాయి. తెలుగు సినీ గాయనీ గాయకులు గీతామాధురి, మల్లిఖార్జున్, గోపిక పూర్ణిమ, తీన్మార్ మంగ్లి తమ పాటలతో వేదికను హోరెత్తించారు. నటులు మరియు మిమిక్రీ కళాకారులు శివా రెడ్డి సినీ మరియు రాజకీయ ప్రముఖులను అనుకరిస్తూ చేసిన పేరడీలు, జోక్స్ ప్రేక్షకులను తెగ నవ్వించాయి. తెలుగు సినీ నాయకులు మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంకా సంప్రదాయ కోలాటం, ఉగాది కవితలు, రాఫుల్ బహుమతులు, ప్రపంచ డోలు నృత్యం మరియు స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలు లాంటి ప్రత్యేకతలు మరెన్నో. సాహిత్యం, పద్య రచన మరియు ఆటల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. నాటా, నాట్స్, ఆటా, తానా, టాటా, సిలికానాంధ్ర తదితర జాతీయ సంస్థల పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరవడం విశేషం. చివరిగా టాస్క్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి సాముల ఈ కార్యక్రమ విజయవంతానికి సహాయపడిన తోటి కార్యవర్గ సభ్యులు, దాతలు, వాలంటీర్స్ తదితరులకు కృతజ్ఞతలు తెలియజేయగా ఉగాది పచ్చడితో కూడిన విందు భోజనాలతో కార్యక్రమం ముగిసింది.

error: NRI2NRI.COM copyright content is protected