ఉత్తర అమెరికా తెలుగు సంఘం TANA ఫౌండేషన్ ‘మీ కోసం మీ స్వంత ఊరి ప్రజల సేవ కోసం’ అంటూ 5కె వాక్/రన్ కార్యక్రమాన్ని మళ్ళీ మొదలుపెట్టింది. గతంలో లానే ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులను రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాలలోతానా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు.
ఈసారి తానా ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి చొరవ తీసుకొని ముందుగా బోస్టన్ లో నిర్వహించడమే కాకుండా విజయవంతం చేసి ఎప్పటిలానే అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలిచారు. 200 మందికి పైగా పాల్గొన్న ఈ న్యూ ఇంగ్లండ్ రీజియన్ 5కె వాక్/రన్ లో 50 మందికి పైగా పాల్గొన్న పిల్లలకు 1కె వాక్/రన్ నిర్వహించడం విశేషం.
ఆహ్లాదకరంగా సాగిన ఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి ప్రసంగిస్తూ తానా ఫౌండేషన్ ప్రస్తుత నాయకత్వం నిర్వహిస్తున్న వివిధ సేవాకార్యమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు మోహన్ నన్నపనేని, నిర్వాణ హెల్త్ సీఈఓ రవి ఇక, నాట్స్ నాయకులు శ్రీనివాస్ గొండి తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు.
సిటీ కోఆర్డినేటర్ కేపి సోంపల్లి, ప్రశాంత్ కాట్రగడ్డ, సూర్య తెలప్రోలు, శ్రీనివాస్ ఎండూరి, గోపి నెక్కలపూడి తదితరులు ఈ 5కె వాక్/రన్ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. అలాగే స్థానిక తెలుగు సంఘం తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ (TAGB) నాయకులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.
న్యూ ఇంగ్లాండ్ మాజీ ప్రాంతీయ కార్యదర్సులు కోటేష్ కందుకూరి, రావు యలమంచిలి, శ్రీనివాస్ కొల్లిపర కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువత, మహిళలు మరియు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం అనంతరం బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు.
తానా ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, నేషనల్ కోఆర్డినేటర్ వీర లెనిన్ తాళ్లూరి, 5కె వాక్ కోచైర్ రవి సామినేని, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సుమంత్ రాంశెట్టి బ్యానర్లు, టి షర్ట్స్ తదితర లాజిస్టిక్స్ విషయంలో సమన్వయం చేశారు.