మార్చ్17న అట్లాంటాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మరియు అట్లాంటా తెలుగు సంఘం తామా సంయుక్తంగా ‘పన్నులు – దాఖలు – ప్రణాళిక’ అనే విషయం మీద ఒక సదస్సు నిర్వహించారు. టాక్సులు ఫైల్ చేసే సమయం అవ్వడం వల్లనో లేక ప్రెసిడెంట్ ట్రంప్ టాక్స్ రిఫార్మ్ వల్లనో ఏమో గాని అట్లాంటా వాసులు విరివిగా పాల్గొన్నారు. మై టాక్స్ ఫైలర్ కంపెనీ నుంచి హరి ప్రసాద్ ఈ సదస్సును ప్రజంట్ చేయగా, తానా నుంచి సెక్రటరీ అంజయ్య చౌదరి లావు, శ్రీనివాస్ లావు, అనిల్ యలమంచిలి, భరత్ మద్దినేని, తామా నుంచి మహేష్ పవార్, విజు చిలువేరు సమన్వయం చేసారు. ముఖ్యంగా ఫెడరల్, స్టేట్, బిజినెస్ టాక్సెస్ మరియు ఈ మధ్యనే వచ్చిన ట్రంప్ టాక్స్ రిఫార్మ్ విషయాలను వివరించారు. అలాగే ప్రతి ఒక్కరు తమ తమ ప్రశ్నలను నివృత్తి చేసుకున్నారు. వినయ్ మద్దినేని ఈ సదస్సుని ప్రజంట్ చేసిన మై టాక్స్ ఫైలర్ హరి ప్రసాద్ గారిని శాలువాతో సత్కరించారు. చివరిగా మనోజ్ తాటికొండ ఈ సదస్సుకు విచ్చేసి విజయవంతం చేసిన అట్లాంటా వాసులకు, ఫోటోగ్రఫీ సేవలందించిన క్రిస్టల్ క్లియర్ ప్రొడక్షన్స్ నుంచి దేవానంద్ కొండూర్, ఆడియో సిస్టం అందించిన మురళి బొడ్డు, వేదికనందించిన పెర్సిస్ రెస్టారంట్ అధినేత శ్రీధర్ దొడ్డపనేని, తదితరులందరికి ధన్యవాదాలు తెలియజేసారు. చివరిగా తేనీయ విందుతో సదస్సు ముగిసింది.