ప్రతి నెలా రెండవ శనివారం నిర్వహించే తానా తెలుగు సాంస్కృతిక సిరులు కార్యక్రమంలో భాగంగా ఈ మార్చి 12వ తేదీ డాక్టర్ కొత్త కాపు స్వరూప గజల్ గానలహరి నిర్వహిస్తున్నారు. గజల్ ఉర్దూలో అత్యంత ప్రధానమైన సాహిత్య ప్రక్రియ. పర్షియన్, ఉర్దూ భాషల ప్రభావంతో తెలుగు సాహితీ లోకంలోకి ఎందరో తెలుగు గజల్ రచయితలు, గాయకులు వచ్చారు. కీ. శే. దాశరధి, డాక్టర్ సినారె వంటి సాహితీ దిగ్గజాలు తెలుగు గజల్ ప్రాభవానికి ఆద్యులు.
డాక్టర్ కొత్త కాపు స్వరూప అనేక వేదికలపై గజల్ ని ఆలపించి తన ప్రతిభను నిరూపించుకున్నారు. రండి ఆమె స్వరం నుండి నవరస భరితంగా వెలువడే గజల్ గీతాల్ని ఆస్వాదించి ఆనందించండి, అలాగే తానా కృషిని ప్రోత్సహించండి అంటున్నారు తానా వారు. డాక్టర్ విజయ్ భాస్కర్ దీర్ఘాశి పర్యవేక్షణలో, తానా సాంస్కృతిక సేవా కార్యదర్శి శిరీష తూనుగుంట్ల ఆధ్వర్యంలో ఈ తానా తెలుగు సాంస్కృతిక సిరులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.