సంస్కృతి, సాహిత్యం పట్ల ప్రేమాభిమానాలతో కళామతల్లి ముద్దు బిడ్డలైన కళాకారులను ప్రోత్సహించే విధంగా ఈ సంవత్సరం క్రొత్తగా ‘తానా తెలుగు సాంస్కృతిక సిరులు’ అనే చక్కని కార్యక్రమాన్ని చేపట్టారు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ వారు. ప్రతి నెలా రెండవ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 12వ తేదిన వీణ మరియు గాత్ర సంగీత కచేరి నిర్వహిస్తున్నారు.
ఈ సంగీత కార్యక్రమానికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీమతి గుత్తి శైలజ వీణ మరియు గాత్రం, బాల అష్టావధాని చి. భరత్ శర్మ ఉప్పలధడియం మృదంగం, అలాగే చి. అనన్య ఉప్పలధడియం సభా వ్యాఖ్యానం మరియు తాళం అందిస్తున్నారు. సహృదయ సంగీత ప్రియులందరు హాజరై ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించవలసిందిగా తానా వారు కోరుతున్నారు.