మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగని ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకోవాలనుకుంటున్నారా? ఐతే మన శాండియేగో తెలుగు అసోసియేషన్, శాంటా వారు నిర్వహిస్తున్న శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది ఉల్లాసం కార్యక్రమానికి వెళ్లాల్సిందే. శాండియేగోలో ఈ శనివారం మార్చ్ 31 న సాయంత్రం 3:30 నుండి జరగబోయే ఈకార్యక్రమానికి మిమ్మల్ని తమ పాటలతో వ్యాఖ్యానంతో ఉర్రూతలూగించడానికి తెలుగు సినీ గాయకులు నేమని పార్థసారధి మరియు సమీరా విచ్చేస్తున్నారు. మరి వీరిని పలకరించి ఫోటోలు దిగాలన్న, ఉగాది పచ్చడి తినాలన్న, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించాలన్న అలాగే పసందైన భోజనం లాగించాలన్న మనశాంటా.ఆర్గ్ లో టికెట్స్ కొనండి.