ఏమాయ చేసావే, అత్తారింటికి దారేది, మిర్చి, రోబో, సన్నాఫ్ సత్యమూర్తి, కిరాక్ పార్టీ… హలో హలో ఏంటి అన్నీ విజయవంతమైన సినిమా పేర్లు చెప్తున్నాడేంటి అనుకుంటున్నారా? ఎం లేదండి ఈ సినిమాల్లో సూపర్ హిట్ పాటలు పాడిన సంగీత స్వరకర్త విజయ్ ప్రకాష్ గారిచే బే ఏరియా తెలుగు సంఘం వారు పాటల కచేరీ నిర్వహించబోతున్నారు. గ్రామీ అవార్డు గెలుచుకున్న జయహో పాటను పాడిన వారిలో ఒకరైన విజయ్ ప్రకాష్ ఫిలింఫేర్, బెస్ట్ మేల్ ప్లేబాక్ మరియు మరెన్నో మ్యూజిక్ అవార్డ్స్ గెలుచుకున్నారు. మరి ఈ యువ ప్రతిభను ఆస్వాదించాలి అంటే ఏప్రిల్ 28 న ఇండియా కమ్యూనిటీ సెంటర్లో సాయంత్రం 6 గంటలనుండి జరగబోయే పాతాళ కచేరీకి టికెట్స్ కొనండి.