ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ అడ్హాక్ కమిటీ మరియు సిటీ కోఆర్డినేటర్స్ సమావేశం జనవరి 12వ తేదీన నిర్వహించారు. తానా కార్యవర్గ సభ్యులు అమెరికాలోని అన్ని తానా అనుబంధ అడ్హాక్ కమిటీలు మరియు సిటీ కోఆర్డినేటర్స్ తో ఉపయుక్తంగా నిర్వహించిన ఈ ఆన్లైన్ సమావేశంలో సుమారు 110 మంది వరకు పాల్గొన్నారు.
తానా కార్యవర్గం అంజయ్య చౌదరి లావు, సతీష్ వేమూరి, అశోక్ బాబు కొల్లా, మురళి తాళ్లూరి, రాజా కసుకుర్తి, శిరీష తూనుగుంట్ల, ఉమ అరమండ్ల కటికి, శశాంక్ యార్లగడ్డ, సురేష్ కాకర్ల, సతీష్ కొమ్మన, రామ్ తోట, వెంకట్ మీసాల, రత్న ప్రసాద్ గుమ్మడి, వెంకట రమణ యార్లగడ్డ, విద్య గారపాటి, రవి సామినేని తదితరులు తమను పరిచయం చేసుకొని, శుభాకాంక్షలతో మొదలెట్టి, తాము ఆల్రెడీ చేసిన, ముందు ముందు చేయబోయే సేవా కార్యక్రమాలను వివరించారు. అలాగే కొందరు అడ్హాక్ కమిటీ మరియు సిటీ కోఆర్డినేటర్స్ తమ ఆలోచనలు, సలహాలు అందించారు.
సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో సందర్భానుచితంగా తానా రధసారధి అంజయ్య చౌదరి కృష్ణుడు అంటూ డల్లాస్ నుంచి వచ్చిన అభినందన సంభాషణ పలువురిలో నవ్వులు పూయించింది. ఈ సమావేశం నిర్వహించడం చాల అభినందనీయం మరియు ఉపయోగకరం అని అందరూ భావించడంతో ముందు ముందు ప్రతి క్వార్టర్ కి ఒకసారి నిర్వహిస్తామన్నారు.