Connect with us

Events

45 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర తామా సొంతం; సంక్రాంతి సంబరాలతో 2026కి ఘనమైన ఆరంభం @ Atlanta, Georgia

Published

on

45 ఏళ్ల సుదీర్ఘమైన ఘన చరిత్రను కలిగిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఆధ్వర్యంలో, ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు జనవరి 17 న అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. స్థానిక సౌత్ ఫోర్సైత్ హై స్కూల్‌ (South Forsyth High School) లో జరిగిన ఈ వేడుకలకు 1000 మందికి పైగా ప్రవాస తెలుగు వారు పాల్గొన్నారు.

ఈ సంబరాలకు ఇండీఫ్రెష్, బైట్‌గ్రాఫ్ ప్రొడక్షన్స్, స్ప్లాష్‌బీఐ, హెచ్‌సీ రోబోటిక్స్, ఆర్పైన్, వెలా లైఫ్ ప్లాన్, శేఖర్స్ రియాల్టీ – శేఖర్ తాడిపర్తి, రియల్ ట్యాక్స్ వ్యాలీ, స్వాతి సంగేపు, వేగా ఏఐ ఐటీ, రమణ లెర్నింగ్ సెంటర్, శేఖర్ కొల్లు రియల్టర్, నార్త్‌ఈస్ట్ మార్ట్గేజ్ 3rd Eye సంస్థలు స్పాన్సర్స్‌గా వ్యవహరించాయి.

తామా (TAMA) వారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక అలంకరణ తెలుగు వారి సంప్రదాయ గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా సర్వాంగసుందరంగా రూపుదిద్దుకుని, అందరి మన్ననలను పొందింది. ఈ సందర్భంగా పార్వతి (Parvathi Kompella) గారు నిర్వహించిన ముగ్గుల పోటీలలో 50 మందికి పైగా మహిళామణులు మరియు చిన్నారులు పాల్గొని, వైవిధ్యభరితమైన ముగ్గులు వేశారు.

హై స్కూల్ విద్యార్థుల కోసం రమణ లెర్నింగ్ వారు నిర్వహించిన SAT ప్రీ-డయాగ్నొస్టిక్ టెస్ట్ లో 40 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా హేమ గారు నిర్వహించిన చిత్రలేఖనంలో 90 మంది పిల్లలు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు.

ఈ మూడు పోటీలలో గెలుపొందిన వారికి తామా (Telugu Association of Metro Atlanta – TAMA) వారు బహుమతులు అందజేశారు. వివిధ రంగాలకు చెందిన వ్యాపారులు ఏర్పాటు చేసిన 30 షాపింగ్ స్టాళ్లు (Shopping Stalls) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాకుండా, రాఫిల్ టికెట్ల ద్వారా ఎంతోమంది వివిధ బహుమతులు గెలుచుకున్నారు.

తామా సాంస్కృతిక కార్యదర్శి కృష్ణ ఇనపకుతిక (Krishna Inapakuthika) ప్రారంభ ఉపన్యాసం చేసి, తామా టీం మరియు బోర్డు సభ్యులను వేదికపైకి ఆహ్వానించి వారి చేత జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం తామా అధ్యక్షురాలు సునీత పోట్నూరు (Suneetha Potnuru), బోర్డు ఛైర్మన్ మధుకర్ యార్లగడ్డ నూతన సభ్యులను సభకు పరిచయం చేస్తూ ప్రసంగించారు.

ఈ సందర్భంగా సునీత పోట్నూరు, మధుకర్ యార్లగడ్డ (Madhukar Yarlagadda), అలాగే కమ్యూనిటీ సర్వీసెస్ కార్యదర్శి శ్రీనివాస్ రామనాథం తామా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత క్లినిక్, వివిధ సదస్సులు, సాహిత్య కార్యక్రమాలు వంటి అనేక సేవా కార్యక్రమాలను వివరిస్తూ, సభకు హాజరైన అందరికీ ఘన స్వాగతం పలికారు.

స్థానిక కళాకారులు సమర్పించిన భక్తి గేయాలు, పాటలు, మెడ్లీలు, నాటకాలు, నృత్యాలు సభకు హాజరైన వారందరినీ మంత్రముగ్ధులను చేశాయి. ఈ మొత్తం వేడుకకు శ్రావణి రాచకుల్ల (Sravani Rachakulla) వాఖ్యాతగా వ్యవహరించారు. గాయకులు మనిషా ఈరబత్తిని (Manisha Eerabathini) మరియు శైలేష్ ఎరుకుల సంయుక్తంగా తమ పాటలతో ప్రేక్షకులను అలరించారు.

దీప్తి వావిలాల సారధ్యంలో స్వరం మ్యూజిక్ స్కూల్ (Swaram Music School) గ్రూప్ వారు శివుడిని కొలుస్తూ ఆలపించిన శివ తాండవం స్తోత్రం (Shiva Thandavam Stotram) భక్తి రసమయులను చక్కగా ఆకట్టుకుంది. రుద్ర తాండవం, ఆనంద తాండవం ప్రదర్శిచిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

విభిన్న పాటల సమ్మేళనంతో సాగిన మ్యూజికల్ నైట్‌ (Musical Night) లో గాయకులు తమ అద్భుత గానంతో దాదాపు మూడు గంటల పాటు ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించారు. ఈ ఉత్సాహభరిత వాతావరణంలో ఎంతోమంది వేదికపైకి వచ్చి నృత్యాలతో కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చారు.

ఈ సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథులుగా జార్జియా స్టేట్ రిప్రెజెంటేటివ్స్ టాడ్ జోన్స్ (Todd Jones), మ్యాట్ రీవ్స్, అలాగే సిటీ కౌన్సిల్ మెంబర్ బాబ్ ఎర్రమిల్లి (Bob Erramilli) గార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తామా బోర్డు ఆఫ్ డైరెక్టర్ సాయిరాం కారుమంచి వారిని సభకు పరిచయం చేశారు.

టాడ్ జోన్స్ గారు మాట్లాడుతూ.. భారతీయ విద్యార్థులు HOPE స్కాలర్‌షిప్‌లను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో వివరించడమే కాకుండా, పన్నుల తగ్గింపుపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, అందరికీ సంక్రాంతి (Sankranthi) శుభాకాంక్షలు తెలిపారు. బాబ్ ఎర్రమిల్లి గార్లు మరియు మ్యాట్ రీవ్స్ కూడా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

స్థానిక మరియూ జాతీయ సంస్థలు (Telugu Associations) మైత్రి, గేట్స్, ఐఎఫ్ఎ, గాటా, తానా (TANA), ఆటా (ATA), టీడీఫ్, TTA, హెచ్ ప్యాక్ నాయకులు విచ్చేసి అభినందనలు తెలియజేశారు. వచ్చిన అతిథులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో వేదికపైకి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు సునీత పోట్నూరు, తిరుమలరావు చిల్లపల్లి, సునీల్ దేవరపల్లి (Suneel Devarapalli), సత్య నాగేందర్ గుత్తుల, కృష్ణ ఇనపకుతిక, నరేన్ నల్లూరి, చలమయ్య బచ్చు, ముఖర్జీ వేములపల్లి, హరికృష్ణ అడ్డంకి, శ్రీనివాస రామనాధం, పార్వతి కొంపెల్ల, చైతన్య కొర్రపాటి, శేఖర్ కొల్లు మరియు బోర్డు సభ్యులు మధుకర్ యార్లగడ్డ, ప్రియాంక బలుసు, వెంకట్ తెరాల, నగేష్ దొడ్డాక, రాఘవ తడవర్తి, రామ్‌కీ చౌడారపు, సాయిరాం కారుమంచి, సురేష్ యాదగిరి (Suresh Yadagiri), యశ్వంత్ జొన్నలగడ్డ పాల్గొన్నారు.

చివరిగా, కనీవినీ ఎరుగని రీతిలో సంక్రాంతి సంబరాలను విజయవంతంగా నిర్వహించిన అట్లాంటా తెలుగు ప్రజలకు, స్పాన్సర్లకు, అతిథులకు, వాలంటీర్లకు, పాఠశాల యాజమాన్యానికి, డెకరేషన్ టీంకు, డీజే టీంకు, రుచికరమైన విందు భోజనాలను అందించిన ఇండీఫ్రెష్ యాజమాన్యానికి, అలాగే కార్యక్రమాన్ని అలరించిన కళాకారులకు సభాముఖంగా తామా ప్రెసిడెంట్-ఎలెక్ట్ తిరుమలరావు చిల్లపల్లి (Tiru Chillapalli) గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగించారు.

error: NRI2NRI.COM copyright content is protected