Chicago, Illinois: సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ప్రతి ఇంటి ముందు అందంగా వేసిన ముగ్గులు వాటి చుట్టూ చేసే అందమైన అలంకరణలు. ఆ సంప్రదాయాన్ని కొనసాగింపుగా చికాగో ఆంధ్ర సంఘం వారు, సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని, జనవరి 11, 2026 వ తేదీన Mall Of India నందు నిర్వహించిన ముగ్గుల పోటీలు (Rangoli Competitions) అంగరంగ వైభవంగా, ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగాయి.
చిన్న పెద్ద అనే భేదం లేకుండా విశేష సంఖ్యలో పాల్గొన్న పోటీదారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ పోటీలలో ముందుగా నమోదు చేసుకున్న పోటీ దారులను పిల్లలు, పిల్లలు – పెద్దలు, పెద్దలు అనే మూడు విభాగాలుగా విభజించి పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని చూడటానికి వచ్చిన చాలామంది ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమం నిర్వహించిన విధానాన్ని మెచ్చుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra Association) అందరికీ ఆదర్శప్రాయమని, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా ఇంకా జరగాలని అభిప్రాయపడ్డారు.
సంస్థ 2026 అధ్యక్షులు తమిశ్రా కొంచాడా (Tamishra Konchada) గారి ప్రారంభ ఉపన్యాసంతో, సంస్థ చైర్మన్ రాఘవ జాట్ల, ఉపాధ్యక్షులు రామక్రిష్ణ తాడేపల్లి సహకారంతో మొదలైన ఈ కార్యక్రమంలో, ముందుగా సాహితి కొత్త, రమ్య మైనేని నేతృత్వంలోని బృందం పద్మారావు అప్పలనేని గారి సహాయంతో, కార్యక్రమానికి విచ్చేసిన పోటీదారులను నమోదు చేసుకొని, వారికి కావలసిన ముగ్గు, ఇతర సామాగ్రిని అందజేశారు.
ఈ పోటీలకు న్యాయ నిర్మేతలుగా డాక్టర్ ఉమా కటికి (Dr. Uma Katiki Aramandla), రమ్య రోడ్డo, మల్లీశ్వరి పెదమల్లు వ్యవహరించారు.ప్రతి విభాగంలో విజేతలు అయిన వారికి మొదటి, రెండవ, మూడవ బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీ అనంతరం, మరొక సంక్రాంతి (Sankranti) సంప్రదాయం ఆయన “భోగిపళ్లు” కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులను, కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులు, పెద్దలు భోగిపళ్ల (Bhogi Pallu) తో ఆశీర్వదించి చిన్నారులు కలకాలం సుఖసంతోషాలతో ఉండాలని దీవించారు.
శృతి కూచంపూడి నేతృత్వంలో, సుజాత అప్పలనేని సహకారంతో, రమ్య మైనేని, పద్మజ గండ్ర, హరిణి మెడ, సుభాష్ చేపలమడుగు బృందం వేదికను అందంగా సంక్రాంతి (Sankranthi Festival) సంబరాలను ప్రతిబింబించేలా ముస్తాబు చేశారు.
సురేష్ ఐనపూడి (Suresh Ainapudi) నేతృత్వంలో, సంస్థ కార్యనిర్వాహక సభ్యులు వారి ఇళ్ల వద్ద తయారు చేసి తీసుకువచ్చిన సంక్రాంతి విందు భోజనం ఆహ్వానితులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాలో పాల్గొన్న చిన్నారులు అందరికీ STEM Shala వారు ప్రత్యేక బహుమతులు అందచేశారు.
చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra Association) తలపెట్టే ముగ్గుల పోటీలతోపాటు, అన్ని ఇతర కార్యక్రమాలకు కావలసిన సహకారాన్ని అందిస్తూ, సంస్థను ముందుకు నడిపిస్తున్న Mall Of India వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సంస్థ కార్యవర్గ సభ్యులైన కిరణ్ వంకాయలపాటి కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయగా, ధర్మేంద్ర గాలి కావలసిన వస్తువులను సమకూర్చారు.
సురేష్ మహాలి (Suresh Mahali) అతిథులకు సాదర స్వాగతం పలుకగా, స్వర్ణ నీలపు, సునీతా రాచపల్లి, శ్రీస్మిత నండూరి, మురళీ రెడ్డివారి, రామారావు కొత్తమాసు, శ్రియ కొంచాడ, దివిజ చల్లా, జై అనికేత్ మెడబోయిన, లక్ష్మినాగ్ సూరిభొట్ల, శ్రీనివాస్ సుబుద్ది వలసిన సహకారాన్ని అందించారు.
Beautiful Ideas వారు కార్యవర్గ సభ్యుల కోసం నిర్వహించిన Raffle నందు విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. చివరగా సంస్థ కార్యదర్శి నరసింహారెడ్డి ఒగ్గు (Narasimhareddy Oggu), ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కార్యక్రమానికి వచ్చిన సభ్యులను, పోటీదారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ..
ఎప్పటిలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తమ సహాయ సహకారాలు అందించిన తోటి కార్యవర్గ సభ్యులకు (Board of Directors), ధర్మకర్తలకు (Trustees), సమర్పకులకు (Sponsors), పూర్వ అధ్యక్షులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు పేరుపేరున ధన్యవాదాలు తెలియజేశారు.